ఒత్తిడి, ఆందోళన ఆహారంలో పీచు లోపించడం ఇలా మలబద్దకానికి బోలెడు కారణాలు ఈ సమస్యను వదిలించుకోవడం కోసం మందుల మీద ఆధార పడకుండా ఇంట్లోనే లాక్సేటివ్ తయారు చేసుకోవచ్చు అదెలాగంటే
కావలసిన పదార్థాలు :
ఎండు ఖర్జూరాలు – కప్పు ఎండు ద్రాక్ష – కప్పు నీళ్లు – 5 కప్పులు
తయారీ విధానం :
- ఎండు ఖర్జూరాలు – కప్పు ఎండు ద్రాక్షలను సన్నగా తరగాలి.
2. నీళ్లను మరిగించి తరిగిన ఎండు ద్రాక్ష ఖర్జూరాలు వేసి తిప్పాలి.
3. ద్రవం చిక్క బడే వరకు చిన్న మంట మీద ఉడికించాలి
4. చల్లార్చి జాడీలో నిల్వ చేసుకోవాలి.
పరగడుపున కానీ ఉదయం అల్పాహారంతో కానీ ఒక చెంచా కలిపి తీసుకుంటే మలబద్దకం దరి చేయకుండా ఉంటుంది