మహిమాన్విత తల్లి సింహవాహిని మహంకాళి

హైదరాబాద్, జూలై 20 (ఇయ్యాల తెలంగాణ) :  తనను నమ్ముకున్న భక్తులను వరద ఉధృతి నుంచి కాపాడి కొండంత ధైర్యాన్ని ప్రసాదించడమే కాకుండా తన మహి మల్ని వివిధ సందర్బాల్లో చూపించిన లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారు కోరుకున్న వారి కోరికలు తీర్చేకొంగు బంగారంగా దర్శనమందిస్తున్నారు. నిజాంకాలంలోనే తన మహిమలతో భక్తులకు ఏ ఆపద వచ్చినా నేనున్నానే భరోసా ఇచ్చారు. 

1908 వ సంవత్సరంలో మూసీనది పొంగి హైదరాబాద్‌ దక్కన్‌ను వరద ఉధృతి ముంచేసి ప్రజలను అతలా కుతలం చేసింది. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో అప్పటి నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ అయోమయంలో పడ్డారు.నిజాం సంస్థానంలో ఇక్క డ రాజ్యానికి ప్రధాన మంత్రి అయిన మహారాజ కిషన్‌ ప్రసాద్‌ నిజాంకు పరిష్కారం కోసం సలహా అందించారు. లాల్‌దర్వాజ ప్రాంతంలో మహంకాళి అమ్మవారు కొలువై ఉన్నారు. ఆ అమ్మవారికి పూజ చేయవలసిందిగా నిజాం రాజుకు సలహా ఇచ్చారు.ప్రధానమంత్రి సలహాతో ఏకీ భవించిన నిజాం ప్రభువు సింహవాహిని అమ్మవారిని దర్శించుకొని బంగారు చాటలో పసుపు,కుంకుమ, గాజులు, మేలిమి ముత్యాలు,చీర రవికతో పూజలు నిర్వ హించారు. అనంతరం చార్మినార్‌ చెంతన కొలువు దీరి యున్న అప్పట్లో మైసమ్మ ఇప్పుడు భాగ్యలక్ష్మీ అమ్మవారిగా వేలాదిమంది భక్తులపై తన కరుణను చూపుతున్న మ్ణైమ్మ ఆలయం వద్దకు వచ్చిన మూసినది వరద ఉధృతి నీటిలో నిమజ్జనం చేసిన పిమ్మట వరద నీరు తగ్గి ప్రజలకు ఉపశమనం కలిగింది.   

                        అంతటి చరితార్థకమైన  చరిత్ర కలిగిన పాతనగర దేవాలయాల పునరుద్దరణ పనులు కొనసాగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 1968 వ సంవత్సరమలో లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి   అమ్మవారి ఆలయాన్ని  పునరుద్దరించి కంచి కామకోటి పీఠాదిపతులు జగద్గురు శ్రీశ్రీశ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతిస్వామి స్వహస్తములతో విగ్రహ ప్రతిష్ఠాపన చేయబడిరది. అనంతరం ఆలయ ప్రాంగణంలో 2008 వ సంవత్సరములో కంచికామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వాముల వారిచే కుంబాభిషేకము  మరియు శక్తి గణపతి విగ్రహ ప్రతిష్టాపన, స్వర్ణ శిఖర  స్థాపన గావించబడినది. నాటి నుంచి నేటి వరకు ప్రతి ఏటా బోనాల ఉత్సవాలను అత్యంత ప్రతి ష్ఠాత్మకంగా భక్తి శ్రద్దలతో నిర్వహిస్తూవస్తున్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....