న్యూఢిల్లీ, ఏప్రిల్ 10 (ఇయ్యాల తెలంగాణ) : సామాజిక ఉద్యమాలకు మార్గదర్శి, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు. అణగారిన వర్గాల సామాజిక న్యాయం, మహిళా విద్య కోసం వారు చేసిన విశేష కృషి అందరికీ మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
సామాజిక సాధికారత కోసం పూలే స్ఫూర్తితో తెలంగాణలో సమగ్ర కుల గణన, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ వంటి అనేక నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.