తాండూరు: ఫిబ్రవరి 24 (ఇయ్యాల తెలంగాణ) : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అంగరంగ వైభవంగా మహలింగార్చన లోక కళ్యాణం కొరకు సనాతన హైందవ ధర్మ పరిరక్షణ దేవాలయాల పరిరక్షణ కొరకు తాండూర్ పట్టణంలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయం నందు నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు బోనగిరి చంద్రశేఖర్ కెశెట్టి సంతోష్ కుమార్ తెలిపారు. స్వస్తిశ్రీ క్రోధి నామ సం మాఘ బహుళ త్రయోదశి తేది 26.02.2025 మహాశివరాత్రి బుధవారం రోజున సాయంత్రం 5 గంటల నుండి ధర్మ రక్షణ దేవాలయాల పరిరక్షణ కొరకు రక్షోఘ్నసూక్త సంపుటీకరణ సహిత మహాలింగార్చన ఇట్టి కార్యక్రమానికి ఎటువంటి టికెట్టు కాని విరాలాలు కాని చెల్లించే అవసరం లేదు పరిపూర్ణ భక్తి శ్రద్ధలే మూల్యంగా సహనము సంయమనమే అలంకారంగా సాగే ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం వహించే అవకాశం ఉన్నందున ప్రతీ ఒక్కరు పాల్గొని పరమేశ్వరుడి కృపకు పాత్రులు కాగలరు ఈ కార్యక్రమము సాయంత్రం 5 గంటల నుండి రాత్రి లింగోద్భవ సమయం వరకు ప్రముఖ వేద పండితులు ఉపాసకుల ఆధ్వర్యంలో కొనసాగుతుందనీ
ఉపాసకులు ముసునూరి కిరణ్ శర్మ అప్పాల సాయిరాం శర్మ ముద్దు ప్రణవ శర్మ ముద్దు విశ్వనాథ శర్మ గూడెపు రామకిషన్ శర్మ ఆలయ అర్చకులు దహగం వినాయక శర్మ మాధవి దహగం శ్రీనివాస్ శర్మ అంకిత కార్యస్థలం శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయం తాండూర్ బస్టాండ్ దగ్గర విద్యా భారతి పాఠశాల ముందర అని ఇట్టి కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనవచ్చని ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేశారు.