Loo – Nar 25 వర్సెస్‌ Chandryaan – ల్యాండింగ్ 12 రోజులు – 40 రోజులు

హైదరాబాద్‌, ఆగస్టు 13, (ఇయ్యాల తెలంగాణ) : చంద్రుడిపైన ఇంతవరకు ఎవరూ చేరుకోని దక్షిణ ధృవంపైకి మనం చంద్రయాన్‌ ప్రయోగం చేపడితే.. అదే చందమామపైకి.. ప్రత్యేకించి మనం గురిపెట్టిన దక్షిణ ధృవంపైకి రాకెట్‌ను ఎక్కుపెట్టింది రష్యన్‌ స్పేస్‌ ఏజెన్సీ. దాని పేరే లూనా 25.  తెల్లవారుజామున 2 గంటల 10 నిముషాలకు నింగిలోకి ఎగిరిందీ రాకెట్‌.దక్షిణ ధ్రువంపై చంద్రయాన్‌`3ని సాఫ్ట్‌ ల్యాండిరగ్‌ చేసి చరిత్ర సృష్టించాలని భావిస్తున్న ఇస్రోకు.. ‘లునా`25’ ప్రయోగంతో రష్యా పోటీ ఇస్తోంది..చంద్రయాన్‌ 3 ప్రయోగానికి మొత్తం 40 రోజులకుపైగా సమయం పడితే.. రష్యా పంపిన లూనా కేవలం 12 రోజుల్లోనే ల్యాండ్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనకంటే తక్కువ టైమ్‌లోనే వాళ్లు చేరుకుంటున్నారు. కానీ ఇక్కడ ఖర్చును కూడా గమనించాలి. లూనాకు అయిన ఖర్చు రష్యా అధికారికంగా ప్రకటించలేదు. కానీ సుమారు 1500 నుంచి 2000 కోట్ల రూపాయల వరకూ ఖర్చు అయినట్టు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన చంద్రయాన్‌తో పోలిస్తే.. మూడు రెట్లు ఖర్చు ఎక్కువ వాళ్లకి. సో.. మనకున్న తక్కువ బడ్జెట్‌, టెక్నాలజీలోనే మన సైంటిస్టులు అద్భుతాలు సృష్టిస్తున్నారనడానికి ఇదే నిదర్శనం.రెండు ఇంజిన్లు ఫెయిల్‌ అయినా.. సాఫ్ట్‌ ల్యాండిరగ్‌ అవుతుందని కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు ఇస్రో చైర్మన్‌ సోమ్‌నాథ్‌. దీంతో ఈసారి చంద్రుడిపై అడుగుపెట్టి. జాబిలి రహస్యాలు ఛేదిస్తామని ధీమాగా ఉంది ఇస్రో. ఇప్పటికే చంద్రుడి చుట్టు చంద్రయాన్‌ 3 తిరుగుతోంది. 

మరోవైపు రష్యా చేపట్టిన లూనా 25 కూడా 5 నుంచి 7 రోజుల పాటు చంద్రుడి కక్ష్యలో ఉంటుంది. మరి ఈ రెండూ ఏమైనా ఢీకొట్టే అవకాశాలు ఉన్నాయా.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అలాంటిదేవిూ లేదంటున్నారు సైంటిస్టులు. ఎందుకంటే ఈ రెండిరటి ల్యాండిరగ్‌ ప్రదేశాలు వేరు. లక్ష్యాలు కూడా వేరు.చంద్రయాన్‌ 3 అనేది జాబిలిపై ఉన్న నీటి జాడలు, ఉపరితలాన్ని పరిశీలించేందుకు వెళ్తోంది. లూనా 25 మాత్రం 30 కేజీల పేలోడ్‌ను మోసుకెళ్తోంది. చంద్రుడిపై మట్టి ఆనవాళ్లను సేకరించేందుకు అవసరమయ్యే రోబోటిక్‌ చేతులు, డ్రిల్లింగ్‌ హార్డ్‌వేర్‌తో పాటు కొన్ని సైంటిఫిక్‌ మెటీరియల్స్‌ ఇందులో ఉన్నాయి. ఈ లూనా`25 ప్రయోగంపై రష్యాకు అభినందనలు తెలిపింది ఇస్రో. ఈ అంతరిక్ష ప్రయాణంలో మనకు మరో విూటింగ్‌ పాయింట్‌ ఉండటం అద్భుతం’’ అని ట్విటర్‌లో రాసుకొచ్చింది. చంద్రయాన్‌`3, లూనా`25 మిషన్లు తమ లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించింది. ఎందుకంటే.. రష్యా మనకి మిత్ర దేశం. ఆయుధాల సప్లై దగ్గర నుంచి అంతర్జాతీయ వేదికలపై పరస్పరం మద్ధతు ఇచ్చుకుంటూ ముందుకు సాగుతున్నాయి రెండు దేశాలు. అంతేకాకుండా స్పోర్టివ్‌నెస్‌గా తీసుకున్న ఇస్రో అభినందలు తెలిపింది.మరోవైపు వరుస ప్రయోగాలతో లూనార్‌ ఆర్బిట్‌లో క్రౌడ్‌ కనిపిస్తోంది. ఎక్కువ వెహికల్స్‌ వస్తే రోడ్డు రద్దీగా మారినట్టే.. వరుస ప్రయోగాలతో లూనార్‌ ఆర్బిట్‌లో కూడా రద్దీగా మారింది. ఆర్బిట్‌లో ప్రస్తుతం 6 యాక్టివ్‌గా ఉన్నాయి. వాటిలో నాసా ప్రయోగాలకు సంబంధించినవి నాలుగు అయితే.. ఇండియాకు సంబంధించిన చంద్రయాన్‌ 2 కూడా ఇప్పటికే ఆర్బిట్‌లో ఉంది. ఇక కొరియాకు చెందిన ఓ ఆర్బిటార్‌ కూడా ఉంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....