
హైదరాబాద్ , జూలై 28 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు ఏర్పాట్ల ప్రక్రియ వేగవంతంతెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం, రాజకీయ పార్టీలు సన్నద్ధ మవుతుండటంతో ఈసీ ఏర్పాట్ల ప్రక్రియను వేగవంతం చేసింది. ఓటర్ల తుది జాబితా తయారీపై దృష్టి సారించింది. పంచాయతీ ఎన్నికల కోసం కొత్త ఓటర్ల జాబితాను రూపొందిస్తున్నారు. ఈసీ ఆదేశాల మేరకు గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని వార్డుల వారీగా ఓటర్ల జాబితాను అధికారులు తయారు చేస్తున్నారు. అటు రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను 2 దశల్లో నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఈసీకి ప్రతిపాదించింది.