Laptop ఒడిలో పెట్టుకుని పనిచేసుకుంటున్నారా.. ? అయితే జర జాగ్రత్త!

హైదరాబాద్‌, జూన్‌ 17 (ఇయ్యాల తెలంగాణ) : ల్యాప్‌టాప్స్‌ ఇప్పుడు మన జీవితాల్లో విడదీయరాని భాగమైపోయాయి. ల్యాప్‌టాప్‌ అంటారు కాబట్టి, దీన్ని చాలామంది ఒడిలో పెట్టుకుని హాయిగా పనిచేసుకుంటూ ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు ఉంటాయట. ముఖ్యంగా పురుషుల విషయంలో ల్యాప్‌టాప్‌ ఒడిలో పెట్టుకోవడం వల్ల వృషణాల ఉష్ణోగ్రత పెరుగుతుంది. అంతేకాకుండా వృషణాలు ఎలెక్ట్రో మ్యాగ్నెటిక్‌ రేడియేషన్‌కు గురవుతాయి. ఉష్ణోగ్రత పెరుగుదల పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, నాణ్యత విూద ప్రతికూల ప్రభావం చూపుతుంది. మిగతా శరీర భాగాలతో పోలిస్తే వృషణాల దగ్గర ఉష్ణోగ్రత రెండు మూడు డిగ్రీలు తక్కువగా ఉంటుంది. ఇందులో ఏ మాత్రం పెరుగుదల కనిపించినా అది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ విూద ప్రభావం చూపుతుంది. ఈ విషయంలో ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. అయినప్పటికీ? ల్యాప్‌టాప్‌లను డెస్క్‌లపైనో, టేబుల్‌పైనో పెట్టి పనిచేసుకుంటే మంచిదని నిపుణుల సలహా.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....