LAND GRABBING ACT పునరుద్దరించాలి !

జూన్ 27 (ఇయ్యాల తెలంగాణ )2024 పేదలు అమాయక ప్రజల భూములను పరిరక్షించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హయాంలో తీసుకువచ్చిన ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌ ను తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్‌ కోరారు. ఈ మేరకు గురువారం ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఈమెయిల్‌ ద్వారా వినతి పత్రాన్ని పంపించారు అనంతరం సైదాబాద్‌ డివిజన్‌ కళ్యాణ్‌ నగర్‌ లోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు 1982లో తీసుకురాబడిన ల్యాండ్‌ గ్రాఫింగ్‌ యాక్ట్‌ వలన ఎంతోమంది అమాయక ప్రజల భూములు సంరక్షించబడ్డాయని అన్నారు పేదల భూములను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోబడ్డాయని వివరించారు అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2016 లో ఈ యాక్ట్‌ ను చట్ట వ్యతిరేకంగా కేవలం ఒక జీవోతో రద్దు చేసిందని విమర్శించారు దాంతో అప్పటినుండి పలుకుబడి గల ఆక్రమణదారులు మరల అమాయక ప్రజల భూములను ఆక్రమిస్తున్నారని ఆరోపించారు దాంతో భూ సమస్యల పరిష్కారం కోసం కోర్టుల్లో లక్షలాది కేసులు పెండిరగ్లో ఉన్నాయన్నారు ప్రజల  పక్షాన నిలుస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం వెంటనే ల్యాండ్‌ క్రాపింగ్‌ యాత్రను పునరుద్ధరించి అమాయక ప్రజలకు అండగా నిలవాలని రాపోలు భాస్కర్‌ కోరారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....