
హైదరాబాద్, జూలై 17 (ఇయ్యాల తెలంగాణ) : లాల్ దర్వాజా సింహవాహిని దేవాలయానికి శ్రీ గోల్కొండ కోట జగదంబ మహాకాళి ఎల్లమ్మ తల్లి దేవాలయం తరపున అక్కడి పని వాళ్ళ సంఘం వృత్తి దారులు సింహవాహిని అమ్మవారికి గురువారం ఒడిబియ్యం, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్బంగా లాల్ దర్వాజా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి వేప కొమ్మలతో సాకలు సమర్పించారు. శాస్త్రీయ కోణంలో అమ్మవారికి నిర్వహించాల్సిన ప్రత్యేక పూజ కార్యక్రమాలతో అమ్మను పూజించి కొలుచుకున్నారు. ఉమ్మడి దేవాలయాల వృత్తి దారుల సంఘం కమిటీ వారికీ ఆహ్వానం పలకడంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు. లాల్ దర్వాజా దేవాలయ కమిటీ సభ్యులు వారికీ సహకరించారు. శ్రీ గోల్కొండ కోట జగదంబ మహాకాళి ఎల్లమ్మ తల్లి దేవాలయం పని వాళ్ళ సంఘం అధ్యక్షులు శివశంకర్ సలహాదారులు బొమ్మల సాయిబాబా చారి, శివరాజు నవీన్, సుధీర్, శ్రావణ్, నరేందర్, రవి, అశోక్ తదితరులు పాల్గొని లాల్ దర్వాజా ఆలయంలో ప్రత్యేక పూజ కార్యకమాలు నిర్వహించారు. అమ్మవారికి ఒడిబియ్యం పట్టు వస్త్రాలు యాపకొమ్మల కల్లు సాక సమర్పించారు. లాల్ దర్వాజా సింహ వాహిని మహాకాళి దేవాలయ కమిటీ మాజీ చైర్మన్ కే వెంకటేష్ ప్రధాన కార్యదర్శి చంద్రకుమార్ విట్టల్ శ్రీరా రాజ్ కుమార్ పని వాళ్ళ సంఘానికి శాలువాతో సత్కరించారు. ఉమ్మడి దేవాలయాల వృత్తిదారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పేరోజి మహేశ్వర్ ప్రధాన కార్యదర్శి కొల్లూరు జ్ఞానేశ్వర్ కోశాధికారి గట్టు సుదర్శన్ సలదారులు నాగిల కృష్ణ వైస్ ప్రెసిడెంట్ బర్గల జగదీష్ గుండ్రా నవీన్ కుమార్ గోల్కొండ పని వాళ్ళ సంఘం సభ్యులకు శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు.