కులం పేరుతో దూషించిన సెక్యూరిటీ గార్డ్‌ పై చర్యలు తీసుకోవాలి:

ఆత్మకూరు: ఆగష్టు 9 (ఇయ్యాల తెలంగాణ) : ఆర్టీసీ డిపోలో స్వీపింగ్‌ అండ్‌ వాషింగ్‌ సెక్షన్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికురాలు దళిత లక్ష్మి ని కులం పేరుతో దూషించి దుర్బసలాడిన ఆర్టీసీ సెక్యూరిటీ గార్డ్‌ కరీమున్నీసాపై చర్యలు తీసుకోవాలని కెవిపిఎస్‌ జిల్లా సహాయ కార్యదర్శి పి భాస్కర్‌ సీఐటీయూ పట్టణ కార్యదర్శి డి రామ్‌ నాయక్‌  ప్రజా సంఘాల నాయకులు  స్వాములు   సుధాకర్‌  నాగరత్నం డిమాండ్‌ చేశారు శుక్రవారం నాడు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో దళిత కార్మికురాలు లక్ష్మి ఆర్టీసీ డిపో మేనేజర్‌  కు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ డిపోలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న కరిమునిసా  దళిత కార్మికురాలు లక్ష్మీ చేత ఉదయం పళ్ళు తోముకోవడానికి వేప పుల్లలు ఎప్పుడు పడితే   అప్పుడు టీలు టిఫిన్లు తెప్పించుకుంటుందని వాటిని  తేవడానికి డబ్బులు అడిగితే నీకు ఎన్నిసార్లు చెప్పాలి నన్ను డబ్బులు అడగవద్దని అంటుంది డబ్బులు ఇవ్వకపోతే నేను టి  తీసుకురాను  అన్నందుకు ఎక్కువ తక్కువ మాట్లాడితే చెప్పుతో కొడతా. మాట్లాడితే మాల మాదిగ బుద్ధి పోనిచ్చుకోవా అంటూ కులం పేరుతో దూషించి అవమానించడమే కాకుండా దురుసుగా ప్రవర్తించిందని తెలిపారు దళిత మహిళ లక్ష్మీ పట్ల కులం పేరుతో దూషించి అనుచితంగా ప్రవర్తించిన ఆర్టీసీ సెక్యూరిటీ గార్డ్‌ కరిమునిస పై విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు లేని పక్షంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాగలక్ష్మి అయ్యా బలరాము నాగరత్నం తిక్క స్వామి దినేష్‌ తదితరులు పాల్గొన్నారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....
Related Post