ఆ కోర్సులకు అనుమతి లేదు

హైదరాబాద్‌, ఆగస్టు 16, (ఇయ్యాల తెలంగాణ) :   ఉన్నత విద్యా సంస్థలు అందించే పలు కోర్సులు రద్దు చేయాలని కోరుతూ యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆరోగ్య సంరక్షణ, నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ అలైడ్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ప్రొఫెషన్స్‌ యాక్ట్‌ 2021 కిందికి వచ్చే కోర్సులను ఓపెన్‌, ఆన్‌లైన్‌, డిస్టెన్స్‌ లెర్నింగ్‌ విధానంలో బోధించడం ఇకపై పూర్తిగా నిలిపివేయాలని కాలేజీలు, యూనివర్సిటీలను ఆదేశించింది. ఓపెన్‌, ఆన్‌లైన్‌ పద్ధతుల్లో ఆయా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించరాదని స్పష్టం చేసింది.జులై`ఆగస్టు 2025 విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సులపై నిషేధం వర్తిస్తుందని పేర్కొంది. జూలై 23, 2025న జరిగిన ఙఉఅ 592వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా.. ఏప్రిల్‌ 22న జరిగిన 24వ దూర విద్య బ్యూరో వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశం సిఫార్సులను అందించింది.

తాజాగా దీనిపై ప్రకటన వెలువరించింది. ఈ ఆదేశాల మేరకు 2025`26 విద్యా సంవత్సరం నుంచి ఏ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ూఆఒ, ఆన్‌లైన్‌ మోడ్‌లో ప్రవేశాలు కల్పించడానికి అనుమతించబడవని పేర్కొంది.ఈ నిషేధం సైకాలజీ, మైక్రోబయాలజీ, ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ సైన్స్‌, బయోటెక్నాలజీ, క్లినికల్‌ న్యూట్రిషన్‌, డైటెటిక్స్‌ వంటి స్పెషలైజేషన్లకు వర్తిస్తుంది. అలాగే సైకాలజీ, మైక్రోబయాలజీ, ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషియన్‌ సైన్స్‌, బయో టెక్నాలజీ, క్లినికల్‌ న్యూట్రిషన్‌, డైటెటిక్స్‌ సహా ఆరోగ్య సంరక్షణ కోర్సులన్నింటిపై నిషేధం కొనసాగుతుందని యూజీసీ తెలిపింది. ఇంగ్లీష్‌, హిందీ, పంజాబీ, ఆర్థిక శాస్త్రం, చరిత్ర, గణితం, ప్రజా పరిపాలన, తత్వశాస్త్రం, రాజకీయ శాస్త్రం, గణాంకాలు, మానవ హక్కులు ? విధులు, సంస్కృతం, మనస్తత్వశాస్త్రం, భౌగోళిక శాస్త్రం, సామాజిక శాస్త్రం, మహిళా అధ్యయనాలు వంటి అంశాలలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ డిగ్రీ వంటి బహుళ స్పెషలైజేషన్లను యథాతథంగా అందిస్తామని, కేవలం ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన స్పెషలైజేషన్‌ కోర్సులను మాత్రమే ఉపసంహరించుకుంటున్నట్లు యూజీసీ స్పష్టం చేసింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....