కిష్కిందపురి September 12న రిలీజ్‌

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, అనుపమ పరమేశ్వరన్‌, కౌశిక్‌ పెగల్లపాటి, సాహు గారపాటి, షైన్‌ స్క్రీన్స్‌ కిష్కిందపురి సెప్టెంబర్‌ 12న రిలీజ్‌  

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ అప్‌ కమింగ్‌ హారర్‌`మిస్టరీ థ్రిల్లర్‌ కిష్కిందపురిలో బోల్డ్‌, ఇంటెన్స్‌ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 12న విడుదల కానుంది. కౌశిక్‌ పెగల్లపాటి దర్శకత్వంలో, షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్‌ మహిళా కథానాయికగా నటించింది. హారర్‌, మిస్టరీ, ఎమోషనల్‌ ఎలిమెంట్స్‌ తో వస్తున్న కిష్కిందపురి ఈ సీజన్‌లో మోస్ట్‌ ఎవైటెడ్‌ మూవీలో ఒకటి. రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌మెంట్‌తో పాటు అదిరిపోయే పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. బెల్లంకొండ శ్రీనివాస్‌ ఇంటెన్స్‌ లుక్‌ లో కనిపించిన ఈ పోస్టర్‌ సస్పెన్స్‌ మరింత పెంచింది, ఆయన ముందు ఒక వింటేజ్‌ రేడియో విరిగి ఎగిరిపోతూ కనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో టెర్రిఫిక్‌ మాన్షన్‌ తో పాటు మంటల్లో కాలి పోతున్న వాన్‌ కనిపించడం థ్రిల్లింగ్‌ గా వుంది ఫస్ట్‌ గ్లింప్స్‌లోనే ప్రేక్షకులు సినిమా సస్పెన్స్‌ ప్రిమైజ్‌ ని ఫీల్‌ అయ్యారు. తాజాగా రిలీజ్‌ అయిన ఫస్ట్‌ సింగిల్‌ ‘‘ఉండిపోవే నాతోనే’’ మాత్రం పూర్తిగా వేరే మూడ్‌ సెట్‌ చేసింది. కథలో టెన్షన్‌తో పాటు ఒక రొమాంటిక్‌ షేడ్‌ ని ప్రజెంట్‌ చేసింది. డైరెక్టర్‌ కౌశిక్‌ పెగళ్లపాటి, కిష్కిందపురి డార్క్‌, మిస్టీరియస్‌ వరల్డ్‌ను చూపిస్తూ, దానికి కాంట్రాస్ట్‌గా ఎమోషనల్‌ మూమెంట్స్‌ ని చక్కగా మిక్స్‌ చేశారు. కథ ముందుకు సాగే కొద్దీ థ్రిల్ల్స్‌తో పాటు ఎమోషన్స్‌ కలిసిన లేయర్డ్‌ ఎక్స్పీరియెన్స్‌ ఇవ్వబోతోంది. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....