KIDNEY రాకెట్‌ పై గురి

విజయవాడ, జూలై 10 (ఇయ్యాల తెలంగాణ ):బెజవాడ, గుంటూరు కేంద్రంగా సాగుతోన్న ఈ కిడ్నీ దందా ఇప్పుడు ఏపీలో సంచలనం రేపుతోంది. ఇడ్లీలు అమ్మినంత ఈజీగా కిడ్నీలు కొట్టేస్తున్నారు కేటుగాళ్లు. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నవాళ్లను టార్గెట్‌గా చేసుకొని వల విసురుతోంది కిడ్నీ మాఫియా. ఒక్క కిడ్నీ ఇస్తే చాలు లైఫ్‌ సెటిలైపోద్ది అంటూ ఎరవేయడంతో నమ్మి మోసపోతున్నారు బాధితులు. కిడ్నీ గ్యాంగ్‌ కోసం వేట మొదలైంది. బాధితుడు మధుబాబు ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌తో యాక్షన్‌లోకి దిగారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని కిడ్నీ దందా వెనుకున్న బ్రోకర్లు బాషా, వెంకట్‌ కోసం గాలింపు ప్రారంభించారు. మొత్తం నాలుగు బృందాలతో ఆపరేషన్‌ స్టార్‌ చేశారు గుంటూరు పోలీసులు. ఇప్పటికే వెంకట్‌ సుబ్రమణ్యంలను గుర్తించారు పోలీసులు. బాషా కోసం గాలింపు ముమ్మరం చేశారు. నిందితుడు విజయవాడకు చెందిన వారిగా గుర్తించారు. విజయవాడలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ జరిగిన విజయ ఆస్పత్రికి ఈరోజు వెళ్లి వివరాలు సేకరించనున్నారు. గతంలోనూ విజయవాడ`గుంటూరు కేంద్రంగా కిడ్నీ మాఫియా అరాచకాలు బయటపడటంతో ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు పోలీసులు.ఈ రాకెట్‌ వెనుక ఎవరెవరి ఇన్వాల్‌మెంట్‌ ఉందో తేల్చే పనిలో పడ్డారు. హోంమంత్రి అనిత సైతం కిడ్నీ దందాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే కిడ్నీ బాధితుడు మధుబాబుకు మెరుగైన వైద్యం కోసం జిజిహెచ్‌?కు తరలించిన పోలీసులు. గార్లపాటి మధుబాబుకు పెళ్లైంది ఇద్దరు పిల్లలున్నారు. ఫేస్‌ బుక్‌ లో పరిచయం ఏర్పరచుకుని కిడ్నీ అమ్మకంపై మాయ మాటలు చెప్పారు. డబ్బుల కోసం నిందితుడిని నిలువునా దోచేశారు. ముప్పై లక్షలు ఇస్తామని ఆశచూపి మోసం చేశారు. రికార్డులు తారుమారు చేశారు. జూన్‌ 15న విజయవాడలోని విజయా సూపర్‌ స్పెషాటిలీ ఆసుపత్రిలో కిడ్నీ ఆపరేషన్‌ చేశారు. అంతా అయిపోయాక లక్షా పదివేల రూపాయలు మాత్రమే చేతిలో పెట్టారు. బాధితుడు మధుబాబు మిగిలిన డబ్బులు ఇవ్వాలంటూ.. మధ్యవర్తి వెంకట్‌?ను అడగటం మొదలు పెట్టాడు. అయితే రక్త సంబంధీకుడుగానే కిడ్ని ఇచ్చావని నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలంటూ బాధితుడితో వెంకట్‌ ఎదురు తిరిగాడు. దీంతో మోసపోయానని తెలుసుకున్న మధుబాబు రెండు రోజుల క్రితం గుంటూరు ఎస్పీని ఆశ్రయించారు. ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌ గా తీసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....