Kerala లో విజృంభిస్తున్న హెపటైటిస్‌ ఎ వైరస్‌

     12మంది మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడి

తిరువనంతపురం మే 16 (ఇయ్యాల తెలంగాణ) : కేరళలో లో హెపటైటిస్‌ ఎ వైరస్‌ విజృంభిస్తుంది. అత్యంత వేగంగా ఈ వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటికే  12మంది మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడిరచింది. ఈ ఏడాది మొదటి నాలుగున్నర నెలల్లో రాష్ట్రంలో 1,977 కేసులు బయటపడ్డాయి.ఈ క్రమంలో అత్యధిక కేసులు నమోదైన కోజికోడ్‌, మలప్పురం, త్రిసూర్‌, ఎర్నాకులం జిల్లాలకు రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌ హెచ్చరికలు జారీ చేశారు. ఈ జిల్లాల్లో వైరస్‌ కట్టడికి క్షేత్రస్థాయిలో పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారును ఆదేశించారు. వైరస్‌ ప్రభావిత ప్రాంతాల్లోని నీటి వనరులను క్లోరినేషన్‌ చేస్తామని, రెస్టారెంట్లకు ఉడికించిన నీటిని మాత్రమే సరఫరా చేయాలని చెప్పినట్లు ఆమె తెలిపారు. 

హెపటైటిస్‌ ఎ వైరస్‌ కాలేయంపై ప్రభావం చూపుతుంది. ఇది కలుషితమైన ఆహారం, నీటి ద్వారా లేదా అంటువ్యాధి కలిగిన వ్యక్తితో ప్రత్యక్ష సంబంధం ద్వారా వ్యాపిస్తుంది.కాగా, ఈ సంవత్సరం రాష్ట్రంలో మరో 5,536 అనుమానిత కేసులు నమోదైనట్లు తెలు?తోంది. మరో 15 మంది ఈ వైరస్‌ కారణంగా మరనించినట్లు అనుమానిస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....