KALKI మానియా మాములుగా లేదుగా

హైదరాబాద్‌, జూన్‌ 28, (ఇయ్యాల తెలంగాణ )2024 ‘కల్కి 2898 ంఆ’.. థియేటర్లలో విడుదల అని ప్రకటించినప్పటి నుండి ప్రభాస్‌ ఫ్యాన్స్‌లో హడావిడి మొదలుపెట్టారు. ముఖ్యంగా ఆర్‌టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సంధ్య 70ఎఎ థియేటర్‌లో ఏ స్టార్‌ హీరో సినిమా విడుదలయినా అది ఒక పండగలాగా ఉంటుంది. అలాగే ‘కల్కి 2898 ంఆ షో పూర్తవ్వగానే థియేటర్లలోని ప్రేక్షకులంతా నిలబడి చప్పట్లు కొట్టారు. ఈ మూమెంట్‌ను కూడా ఫ్యాన్స్‌ వీడియో తీసి సోషల్‌ విూడియాలో షేర్‌ చేసుకున్నారు. ‘కల్కి 2898 ంఆ’ని చూసిన తర్వాత ప్రభాస్‌ను, దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ను తెగ ప్రశంసించేస్తున్నారు. కచ్చితంగా ఇది టాలీవుడ్‌లో తెరకెక్కిన హాలీవుడ్‌ లెవెల్‌ మూవీ అంటూ పాజిటివ్‌ రివ్యూలు ఇచ్చేస్తున్నారు. ఉదయం 4 గంటల షో నుండి బయటికి రాగానే సోషల్‌ విూడియా అంతా ఒక్కసారిగా ‘కల్కి 2898 ంఆ’ పాజిటివ్‌ రివ్యూలతో నిండిపోయింది. దీంతో కలెక్షన్స్‌ కూడా ఒక రేంజ్‌లో ఉండబోతున్నాయని ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు.కల్కి 2898 ంఆ’ని ఫస్ట్‌ డేనే చూడాలని చాలామంది ఫ్యాన్స్‌ ఫిక్స్‌ అయిపోయి ఉన్నారు. టికెట్ల కోసం పెద్ద యుద్ధమే చేశామంటూ వారి కష్టం గురించి చెప్పుకొచ్చారు. అలా అందరికంటే
ముందే సినిమాను చూసినవారు.. అందరూ తప్పకుండా చూడాలంటూ రికమెండ్‌ చేయడం మొదలుపెట్టారు. కేవలం ఫస్ట్‌ డే మాత్రమే కాదు.. ‘కల్కి 2898 ంఆ’ సినిమా కోసం ఫస్ట్‌ వీకెండ్‌ మొత్తం టికెట్లు దొరకడం కష్టమని సోషల్‌ విూడియాలో కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ప్రభాస్‌ హార్డ్‌కోర్‌ ఫ్యాన్స్‌ అయితే మూవీని ఒకసారి కాకుండా రెండు, మూడుసార్లు చూడడానికి కూడా సిద్ధమయిపోతున్నారు.ముఖ్యంగా ‘కల్కి 2898 ంఆ’ విషయం నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌ చాలామందిని ఆశ్చర్యపరిచిందని ఆడియన్స్‌ అంటున్నారు. హాలీవుడ్‌ రేంజ్‌లో తెరకెక్కిస్తానని, ప్రభాస్‌ను కొత్తగా చూపిస్తానని నాగ్‌ అశ్విన్‌ ముందే ఫ్యాన్స్‌కు మాటిచ్చాడు. కానీ మరీ ఈ రేంజ్‌లో ఉంటుందని ఊహించలేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్‌. ప్రభాస్‌ మాత్రమే కాదు.. దీపికా పదుకొనె, అమితాబ్‌ బచ్చన్‌ పాత్రలకు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా కమల్‌ హాసన్‌ క్యారెక్టర్‌ను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు ప్రేక్షకులు. మధ్యలో వచ్చే గెస్ట్‌ రోల్స్‌ అయితే ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....