కాళీమాత విగ్రహాన్ని మేరీమాతగా మార్చిన పూజారి..

ముంబైలో కలకలం

ముంబై కాళీ ఆలయంలో అమ్మవారి విగ్రహం ధ్వంసం

మేరీమాత రూపంలోకి విగ్రహాన్ని మార్చిన ఆలయ పూజారి

కలలో దేవతే చెప్పిందని పూజారి వింత వాదన

పూజారిని అరెస్ట్‌ చేసి విచారిస్తున్న పోలీసులు

విగ్రహాన్ని పూర్వస్థితికి తీసుకువచ్చిన అధికారులు

ముంబై, నవంబర్‌ 26 (ఇయ్యాల తెలంగాణ) : ముంబై శివారు చెంబూర్‌లోని ఒక కాళీమాత ఆలయంలో విగ్రహాన్ని మేరీమాత రూపంలోకి మార్చడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు బాధ్యుడిగా భావిస్తున్న ఆలయ పూజారిని పోలీసులు అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు. భక్తుల ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.చెంబూర్‌లోని అనిక్‌ విలేజ్‌లో ఉన్న హిందూ శ్మశానవాటికలోని కాళీ ఆలయంలో శనివారం ఈ ఘటన జరిగింది. కాళీమాత నల్లటి విగ్రహానికి తెలుపు రంగు పూసి, బంగారు వస్త్రాలు, సిలువతో కూడిన కిరీటాన్ని అలంకరించారు. అమ్మవారి చేతిలో శిశువు ఏసును పోలిన బొమ్మను ఉంచారు. గర్భగుడి నేపథ్యాన్ని కూడా ఎర్రటి వస్త్రం, పెద్ద సిలువతో మార్చేశారు. ఇది చూసి భక్తులుగ్భ్భ్రాంతికి గురయ్యారు. దీనిపై పూజారిని ప్రశ్నించగా, కలలో కాళీమాత కనిపించి తనను మేరీమాత రూపంలో అలంకరించమని చెప్పిందని సమాధానమిచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఎలాంటి పుకార్లు వ్యాపించకుండా, ఉద్రిక్తతలు పెరగకుండా ఉండేందుకు పోలీసుల సమక్షంలోనే విగ్రహాన్ని తిరిగి పూర్వస్థితికి మార్చారు.పూజారిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరచగా, రెండు రోజుల పోలీస్‌ కస్టడీకి అనుమతి లభించింది. మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు భారతీయ న్యాయ సంహిత సెక్షన్‌ 299 కింద కేసు నమోదు చేశారు. ఈ చర్య వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? ఇతరుల ప్రమేయం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనను విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌ దళ్‌ తీవ్రంగా ఖండిరచాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....