June లో మైత్రీ మూవీ మేకర్స్‌ ? ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ షూటింగ్‌

మోస్ట్‌ సక్సెస్‌ ఫుల్‌ కాంబినేషన్‌ పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, బ్లాక్‌ బస్టర్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ హైలీ యాంటిసిపేటెడ్‌ మూవీ ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ జూన్‌ నుంచి రెగ్యులర్‌ షూట్‌ ప్రారంభం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ యెర్నేని, వై. రవి శంకర్‌ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది కంప్లీట్‌ రీలోడెడ్‌, రీ ఇమాజిన్డ్‌ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.పవన్‌ కల్యాణ్‌ పూర్తి స్థాయి కమర్షియల్‌ మాస్‌ అవతార్‌ లో అలరించబోతున్నారు. ఇది అభిమానులకే కాదు, యావత్‌ ప్రేక్షకులకు హై`ఓక్టేన్‌ కథనంతో గ్రేట్‌ సినిమాటిక్‌ ఎక్స్‌ పీరియన్స్‌ అందించబోతోంది.ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌ గా నటిస్తున్నారు. ఆశుతోష్‌ రానా, నవాబ్‌ షా, ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ అవినాష్‌, గౌతమి, నాగ మహేశ్‌, టెంపర్‌ వంశీ  కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు, యంగ్‌ డైనమైట్‌ ఉజ్వల్‌ కుల్కర్నీ  ఎడిటర్‌. రామ్‌`లక్ష్మణ్‌  మాస్టర్స్‌  యాక్షన్‌ సన్నివేశాలను కొరియోగ్రాఫ్‌ చేస్తున్నారు. స్క్రీన్‌ప్లే క.దశరథ్‌, రమేష్‌ రెడ్డి అందిస్తున్నారు, ప్రవీణ్‌ వర్మ, చంద్రమోహన్‌ అడిషినల్‌ రైటర్స్‌. ప్రొడక్షన్‌ డిజైన్‌ను అవార్డ్‌ విన్నింగ్‌ ఆనంద్‌ సాయి అందిస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....