JULY 4 నుంచి ENGINEERING COUNSELLING

హైదరాబాద్‌, జూన్‌ 26, (ఇయ్యాల తెలంగాణ )  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో 2024`25 విద్యా సంవత్సరానికి బీటెక్‌, బీఈ కోర్సుల్లో ప్రవేశాలకు రేపట్నుంచి జరగవల్సిన ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ వాయిదా పడిరది. ఈ మేరకు ఇంజినీరింగ్‌ కోర్సుల ప్రవేశాల కౌల్సింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. మొత్తం మూడు విడతలుగా జరగాల్సిన ఇంజినీరింగ్‌ కౌన్సిలింగ్‌ జూన్‌ 27 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. అది వాయిదా పడిరది. ఈ సందర్భంగా కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం తొలివిడత ప్రవేశాల ప్రక్రియ జులై 4 నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు.

తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 కొత్త షెడ్యూల్‌ ఇదే..

జులై 4 నుంచి ఇంజినీరింగ్‌ తొలివిడత రిజిస్ట్రేషన్లు ప్రారంభం

జులై 6 నుంచి 13 వరకు తొలి విడత సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌

జులై 8 నుంచి 15 వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం

జులై 19న తొలివిడత సీట్ల కేటాయింపు

జులై 26 నుంచి రెండో విడత కౌన్సిలింగ్జు

జులై 27న సర్టిఫికెట్‌ వెరిఫికేషన్జు

జులై 27, 28 తేదీల్లో రెండో విడత వెబ్‌ ఆప్షన్లకు అవకాశం

జులై 31న రెండో విడత సీట్ల కేటాయింపు

ఆగస్టు 8 నుంచి మూడో విడత కౌన్సిలింగ్‌ ప్రక్రియ

ఆగస్టు 9న సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ఆ

గస్టు 9,10 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లకు అవకాశం

ఆగస్టు 13న 3వ విడత సీట్ల కేటాయింపు

ఆగస్టు 21 నుంచి కన్వినర్‌ కోట ఇంటర్నల్‌ స్లైడిరగ్‌ కి అవకాశం

కాగా ఈ ఏడాది జరిగిన టీఎస్‌ ఈఏపీసెట్‌ పరీక్షకు 2,54,814 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంజనీరింగ్‌ విభాగంలో 2,40,618 మంది విద్యార్థులు.. అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాల్లో 91,633 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షకు హాజరైన వారిలో అగ్రికల్చర్‌, ఫార్మసీలో 89 శాతం, ఇంజినీరింగ్‌ విభాగంలో 74.98 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మరో రెండు రోజుల్లో కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం అవుతుందనంగా ఇంతలో కొన్ని కారణాల రిత్య కౌన్సెలింగ్‌ తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....