July 2న రాహుల్‌ గాంధీ వ్యక్తి గతంగా కోర్టుకు హాజరుకావాలి !


ఎంపి`ఎమ్మెల్యే కోర్టు ఆదేశం : 

సుల్తాన్‌పూర్‌(యుపి), జూన్ 26 (ఇయ్యాల తెలంగాణ) : కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపిస్తూ దాఖలు చేసిన పరువునష్టం కేసులో జులై 2వ తేదీన తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని ఎంపి`ఎమ్మెల్యే కోర్టు బుధవారం ఆదేశించింది. ఈ కేసులో తనను కూడా ప్రతివాదిగా చేర్చుకోవాలంటూ రాంప్రతాప్‌ అనే వ్యక్తి చేసిన అభ్యర్థనను పిటిషనర్‌ తరఫు న్యాయవాది సంతోష్‌ కుమార్‌ పాండే వ్యతిరేకించారు. రాంప్రతాప్‌ అనే వ్యక్తి బాధితుడిని కాని ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తి కాని కాదని పాండే వాదించారు.అయితే పాండే వాదనను రాహుల్‌ గాంధీ తరఫు న్యాయవాది కాశీ ప్రసాద్‌ శుక్లా తోసిపుచ్చారు. అయితే ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం రాం ప్రతాప్‌ అభ్యర్థనను కొట్టివేస్తూ జులై 2న తుదపరి విచారణ రోజున రాహుల్‌ గాంధీ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. అమిత్‌ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ 2018లో రాహుల్‌ గాంధీపై పరువునష్టం కేసు దాఖలైంది. బిజెపి నాయకుడు విజయ్‌ మిశ్రా ఈ కేసు దాఖలు చేశారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....