‘జిగ్రీస్‌’ క్రేజీ అడ్వెంచర్స్‌ Teaser

సెన్సేషనల్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా లాంచ్‌ చేసిన మౌంట్‌ మెరు పిక్చర్స్‌ ‘జిగ్రీస్‌’ క్రేజీ అడ్వెంచర్స్‌ టీజర్‌

కృష్ణ బురుగుల, ధీరజ్‌ అథేర్య, మణి వక్కా, రామ్‌ నితిన్‌ ప్రధాన పాత్రల్లో మౌంట్‌ మెరు పిక్చర్స్‌ నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ క్రేజీ ఎంటర్‌టైనర్‌ ‘‘జిగ్రీస్‌’’. హరిష్‌ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ వోడపల్లి నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది.సెన్సేషనల్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా తాజాగా టీజర్‌ ని లాంచ్‌ చేసి టీంకి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.

జిగ్రీస్‌ ఫ్రెండ్షిప్‌, క్రేజీ అడ్వెంచర్స్‌, హిలేరియస్‌ రోడ్‌ ట్రిప్‌ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని టీజర్‌ ప్రామిస్‌ చేస్తోంది.’కొంతమంది ఉంటారు శుద్ధ పూసలు. ఫస్ట్‌ వద్దేవద్దు అని షో చేస్తారు. తర్వాత కూర్చున్నాక నాకంటే ఎక్కువ తాగుతారు’ అనే డైలాగ్‌ తో మొదలైన టీజర్‌ అవుట్‌ అండ్‌ హిలేరియస్‌ గా వుంది.కృష్ణ బురుగుల, ధీరజ్‌ అథేర్య, మణి వక్కా, రామ్‌ నితిన్‌ క్యారెక్టర్స్‌, పెర్ఫార్మెన్స్‌ అదిరిపోయింది.డైరెక్టర్‌ హరిష్‌ రెడ్డి ఉప్పుల యూత్‌ ఆడియన్స్‌ కి మంచి ట్రీట్‌ ఇవ్వబోతున్నారని టీజర్‌ చూస్తే అర్ధమౌతోంది. ఈశ్వరాదిత్య కెమరా వర్క్‌, కమ్రాన్‌ మ్యూజిక్‌ ఫన్‌ ని మరింత ఎలివేట్‌ చేశాయి.టీజర్‌ సోషల్‌ విూడియాలో మంచి బజ్‌ క్రియేట్‌ చేస్తోంది.

త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....