ముంబాయి జులై 31, (ఇయ్యాల తెలంగాణ ): నిందితుడుఆర్పీఎఫ్ జవానే
మహారాష్ట్రలోని పాల్ఘర్ రైల్వే స్టేషన్ సవిూపంలో జైపూర్ ? ముంబై ఎక్స్ ప్రెస్ రైలు (12956)లో కాల్పులు ఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో నలుగురు మరణించారు.. వారిలో ఒక ఆర్పీఎఫ్ ఏఎస్‌ఐ టికారాం, ఇద్దరు ప్రయాణీకులు, ఒకరు పాంట్రీ వర్కర్ ఉన్నారు. సోమవారం తెల్లవారు జామున ఐదు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
మృతదేహాలను బోరివలి స్టేషన్ లో దించి ఆసుపత్రికి తరలించారు. జైపూర్ ఎక్స్ ప్రెస్ రైలు జైపూర్ నుంచి ముంబై వెళ్తున్న క్రమంలో కాల్పులు జరిగినట్లు తెలిసింది. అయితే, ఈ కాల్పులు జరిపింది ఆర్పీఎఫ్ (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) కానిస్టేబుల్ చేతన్ కుమార్ గా గుర్తించారు. దహిసార్ రైల్వే స్టేషన్ లో దిగి పారిపోతుంటే ఆర్పీఎఫ్ జవాన్లు వెంబడిరచి అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానిస్టేబుల్ మానసిక ఒత్తిడికి గురవుతున్నాడని చెబుతున్నారు. మృతిచెందిన ఏఎస్సై టికారాం కుటుంబానికి కు రైల్వే శాఖ 25 లక్షల పరిహారం ప్రకటించింది.