
హైదరాబాద్, జూన్ 20, (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రంలో కన్నుల పండుగగా జరిగే బోనాల జాతరలో భాగంగా గోల్కొండ జగదాంబికా అమ్మవారి కోసం బొమ్మల కుటుంబ సభ్యులు బంగారు బోనం తయారు చేయించారు. ఈ నెల 26వ తేదీ నాడు గోల్కొండ రిసాల బజార్ నుంచి సుమారు 100 మంది పోతరాజులు మరియు కళాకారులతో అమ్మవారికి తొలి బోనం బయలు దేరుతుందని నిర్వాహకుడు శ్రీకాంత్ చారి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని నిర్వాహకుడు శ్రీకాంత్ చారి తెలిపారు.