
విజయవాడ, సెప్టెంబర్ 06 (ఇయ్యాల తెలంగాణ) : ఆదివారం ఏర్పడనున్న చంద్రగ్రహణం కారణంగా ఇంద్రకీలాద్రి ఆలయం మూసివేస్తున్నట్లు ఆలయాధికారులు ప్రకటించారు. మధ్యాహ్నం 3:30 గంటల నుంచి ‘కవాట బంధనం’ చేయనున్నట్లు తెలిపారు. తిరిగి సోమవారం తెల్లవారుజామున ఆలయ పునః ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. ఉదయం 8:30 వరకు ఆలయ శుద్ధి, స్నపనాభిషేకం, అర్చన వంటి పూజా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.