India కి స్వేచ్ఛ, స్వాతంత్రం కావాలని కలలుకన్న మహనీయుడు – మంగళ్‌ పాండే !

 1857 సిపాయిల తిరుగుబాటులో ఆంగ్లేయులకు ఎదురు తిరిగిన 

మొదటి సిపాయి మన మంగళ్‌ పాండే

 `నేడు ఆయన జయంతి

భారతదేశనికి స్వేచ్ఛ, స్వాతంత్రం కావాలని కలలుకన్న మహనీయుడు అతడు. అతడి పేరు వింటేనే బ్రిటిష్‌ వారి గుండెలో చలి జ్వరం పుట్టించిన భారతదేశ సింహస్వప్నం. బహుశా ఈ తరం యువకులకు మంగల్‌ పాండే గురించి అంతగా తెలువకపోవచ్చు కానీ దేశ మొదటి స్వతంత్య్ర సంగ్రామంలో బొబ్బిలి పులిల పోరాడిన ధీరుడు. మంగల్‌ పాండే 19 జులై 1827న ఉత్తరప్ర దేశ్‌లోని నగ్వ గ్రామంలో దివాకర్‌, అభైరని పాండే లకు జన్మించాడు. 1857` 58 మధ్య కాలంలో ఉత్త ర, మధ్య భారతదేశంలో బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా సిపాయిల తిరుగుబాటు జరిగింది. భారత చరిత్రకా రులు ఈ తిరుగుబాటును ప్రథమ స్వతంత్య్ర సంగ్రా మంగా భావిస్తారు. దశాబ్దాలుగా భారతీయ సిపాయి లకి బ్రిటిష్‌ అధికారులకీ మధ్యగల జాతీయ, సాంస్కృతిక, సామాజిక వైరుధ్యాలు తిరుగుబాట్లకి దారితీశాయి. బ్రిటిష్‌ వారికి భారత పాలకులైన మొగలులు, పీష్వాల పట్ల నిర్లక్ష్య వైఖరి లాంటి రాజకీ య కారణాల వల్ల భారతీయులు బ్రిటిష్‌ పాలనను వ్యతిరేకించారు. డౌహల్సి ప్రవేశపెట్టిన రాజ్యసంక్ర మణ సిద్ధాంతం లాంటివి ప్రజాగ్రహానికి కారణమ య్యాయి. ఈనేపథ్యంలో బ్రిటిష్‌ వారు సిపాయిలను ఇబ్బందులకు గురిచేశారు. దాని ఫలితంగా 1857 మార్చ్‌ నెలలో 34వ దేశీయ పదాతి దళానికి చెందిన సైనికుడు మంగల్‌ పాండే బ్రిటిష్‌ సార్జెంట్‌ విూద దాడిచేసి, అతని సహాయకుడిని గాయపరచాడు. దానికి సార్జెంట్‌.. మంగల్‌ పాండేను మతపిచ్చి పట్టినవాడిగా భావించి పాండేను బంధించాలని జమిందార్‌ను ఆజ్ఞాపించాడు. అతను కూడా జమిందార్‌ ఆజ్ఞను తిరస్కరించాడం ద్వారా సిపాయిల తిరుగుబాటు మొదలైంది. బ్రిటిష్‌ వారిని భారత సిపాయిలు ఊచకోత కోశారు. దీంతో మంగల్‌ పాండేను, జమిందార్‌ను బ్రిటిష్‌ ప్రభుత్వం పట్టుకొని ఏప్రిల్‌ 7న ఉరితీసింది. పాండే స్ఫూర్తితో మధ్య భారతదేశంలో ఝాన్సీరాణి, నానాసాహెబ్‌ లాంటి ధీరులు కూడా స్వతంత్య్ర సంగ్రామంలో పోరాడారు. పాండేకు గౌరవార్ధం అప్పటి ప్రభుత్వం 1984లో పోస్టల్‌ స్టాంప్‌ను విడుదల చేసింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....