హైదరాబాద్,మే 16 (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్ మహానగరంలో ఒక్కసారిగా వాతావరణ మారింది. పలు ప్రాంతాల్లో భారీగా వాన దంచి కొట్టడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రయాణీకులంతా ఎక్కడి వారు అక్కడే ఆగిపోయారు. ఆఫీసులు, కాలేజీలు వదిలే సమయం కావడంతో జనాలంతా రోడ్లమీదే నిలబడిపోయారు. అనేక చోట్ల వీధులన్నీ జలమయమయ్యాయి. గోషామహల్, బేగంబజార్, కోటి, నారాయణగూడ , ముషీరాబాద్, చిక్కడపల్లి కవాడిగూడ, రాంనగర్ తదితర ప్రాంతాలతో పాటు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షం నీరు రోడ్డుపై చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. వర్షం కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలను కోరారు.
