Hyderabad లో రామ్‌ చరణ్‌ పాన్‌ ఇండియా ఫిల్మ్‌ ‘పెద్ది’

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హైలీ యాంటిసిపేటెడ్‌ పాన్‌`ఇండియా ప్రాజెక్ట్‌ పెద్ది. నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ ఫిలిం మేకర్‌ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సినిమా ఫస్ట్‌ షాట్‌ గ్లింప్స్‌ తో దేశవ్యాప్తంగా హ్యుజ్‌ బజ్‌ క్రియేట్‌ చేసింది. పవర్‌ ఫుల్‌ కొలాబరేషన్‌, అద్భుతమైన టీంతో ‘పెద్ది’ భారతీయ సినిమాలో కొత్త ప్రమాణాలను నెలకొల్పడానికి సిద్ధంగా ఉంది. ప్రముఖ పాన్‌`ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో విజనరీ వెంకట సతీష్‌ కిలారు తన ప్రతిష్టాత్మక బ్యానర్‌ వృద్ధి సినిమాస్‌ బ్యానర్‌ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్న పెద్ది, లెన్తీ క్రూషియల్‌ షెడ్యూల్‌ హైదరాబాద్‌లోని మ్యాసీవ్‌ విలేజ్‌ సెట్‌లో ప్రారంభమౌతోంది.

’’పెద్ది’’ లోని రా అండ్‌ రస్టిక్‌ బ్యాక్‌ డ్రాప్‌, మూలకథను ప్రతిబింబించేలా, ప్రేక్షకులకు ఓ ప్రత్యేక అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో టీం అద్భుతమైన వర్క్‌ చేస్తోంది. ప్రముఖ ప్రొడక్షన్‌ డిజైనర్‌ అవినాష్‌ కొల్లా నేతృత్వంలో మ్యాసీవ్‌ విలేజ్‌ సెట్‌ ని నిర్మించారు. ఇక్కడ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌, టాకీ పోర్షన్‌ ని చిత్రీకరించనున్నారు.ఇప్పటికే 30% షూటింగ్‌ పూర్తి కాగా, ప్రస్తుతం ప్రారంభమైన ఈ షెడ్యూల్‌ ద్వారా సినిమా ఓ కీలక దశను చేరుకోనుంది. ‘‘ఉప్పెన’’ విజయం తర్వాత బుచ్చి బాబు సానా మరింత ప్రెస్టిజియస్‌ గా, ప్రతి విభాగాన్ని చాలా కేర్‌ తీసుకుంటూ గ్రాండ్‌ స్కేల్‌ లో రూపొందిస్తున్నారు.ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ రస్టిక్‌ అండ్‌ రగ్గడ్‌ లుక్‌ లో కనిపించనున్నారు. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్‌ కుమార్‌, జగపతి బాబు, దివ్యేంద్రు శర్మ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

చిత్రానికి స్టార్‌ డివోపీ ఆర్‌. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఆస్కార్‌ అవార్డు విజేత ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డు గెలుచుకున్న నవీన్‌ నూలి ఎడిటింగ్‌ బాధ్యతలు చేపట్టారు.

ఈ చిత్రం 2026 మార్చి 27న రామ్‌ చరణ్‌ పుట్టినరోజున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

తారాగణం: రామ్‌ చరణ్‌, జాన్వి కపూర్‌, శివ రాజ్‌ కుమార్‌, జగపతి బాబు, దివ్యేందు శర్మ

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....