Hyderabad లో శ్రీరామనవమి శోభాయాత్రను ప్రారంభించిన గవర్నర్

హైదరాబాద్, మార్చి 27 (ఇయ్యాల తెలంగాణ) :  నగరంలో శ్రీరామనవమి శోభాయాత్రను రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. సీతారాంబాగ్ ఆలయం నుంచి కోఠిలోని హనుమాన్ వ్యాయామశాల వరకు ఈ శోభాయాత్ర కొనసాగుతుంది. శోభాయాత్రను ప్రారంభించిన అనంతరం గవర్నర్ మాట్లాడుతూ, ఏళ్ల తరబడి నగరంలో శ్రీరామ శోభాయాత్ర ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు.భారతీయ సంస్కతిలో రామాయణానికి చాలా విశిష్ఠత ఉందని అన్నారు. ఆదర్శ కుమారుడు, ఆదర్శ భర్త, ఆదర్శ పురుషుడుగా శ్రీరాముడిని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఐకమత్యం, భక్తిభావనకు శోభాయాత్ర నిదర్శనంగా నిలుస్తోందని గవర్నర్ అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....