Hyderabad లో పబ్స్ పై ఈగల్ పంజా

హైదరాబాద్, ఏప్రిల్ 4 (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు పోలీసులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా  ఈగిల్ బందం   చ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని పబ్‌లపై మెరుపు దాడులు నిర్వహించింది. కొండాపూర్‌లోని క్వేక్ అరీనా  పబ్‌లో  డీజే బ్లాక్ కాఫీ పేరుతో జరుగిన ఈవెంట్‌పై విశ్వసనీయ సమాచారం అందడంతో అధికారులు రంగంలోకి దిగారు. నిబంధనలకు విరుద్ధంగా అర్థరాత్రి వరకు సాగుతున్న ఈ వేడుకలో డ్రగ్స్ వినియోగం జరుగుతోందన్న అనుమానంతో అక్కడికక్కడే లైవ్ డ్రగ్ టెస్టులు నిర్వహించడం కలకలం రేపింది.పబ్‌లో ఉన్న అనుమానితులకు నిర్వహించిన డ్రగ్ అనాలిసిస్ పరీక్షల్లో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. పార్టీకి హాజరైన వారిలో ఎనిమిది మంది డ్రగ్స్ తీసుకున్నట్లు పరీక్షల్లో తేలింది . దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

వీరిపై ఎన్డీపీఎస్  చట్టం కింద కేసులు నమోదు చేసి, ఈ డ్రగ్స్ ఎక్కడి నుండి వచ్చాయి? వీటి వెనుక ఉన్న నెట్‌వర్క్ ఏంటి? అనే కోణంలో విచారణను ముమ్మరం చేశారు.ఈ పార్టీకి టాలీవుడ్ సీనియర్ నటి హేమ కూడా హాజరుకావడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలోనూ ఇలాంటి ఘటనల్లో ఆమె పేరు వినిపించడంతో, ఈసారి ఆమె స్వయంగా రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చారు. తానూ ఆ పబ్‌కు వెళ్లిన మాట వాస్తవమేనని, అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని సోషల్ విÖడియా వేదికగా స్పష్టం చేశారు. ఈగిల్ అధికారులు తనకు కూడా డ్రగ్ టెస్ట్ నిర్వహించారని, తన యూరిన్ శాంపిల్స్ పరీక్షించిన తర్వాత రిజల్ట్ నెగటివ్ అని వచ్చిందని ఆమె వెల్లడించారు.   తనపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టేందుకు హేమ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక వీడియోను షేర్ చేశారు. అందులో ఈగిల్ అధికారులు తన శాంపిల్ సేకరించడం, టెస్టింగ్ కిట్‌లో రిజల్ట్ నెగటివ్ అని రావడం స్పష్టంగా కనిపిస్తోంది.  నేను పబ్‌కు వెళ్లాను, అధికారులకు సహకరించాను, నా రిజల్ట్ నెగటివ్ వచ్చింది అని ఆమె నిర్మొహమాటంగా ప్రకటించారు. దీంతో డ్రగ్స్ కేసులో ఆమె చుట్టూ ముసురుకున్న వివాదానికి తాత్కాలికంగా తెరపడినట్లయింది. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిలో  ఓసివిల్ సర్వీస్ అధికారి కుమారుడు ఉన్నట్లుగా గుర్తించారు.  

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....