హైదరాబాద్, ఆగస్టు 9 (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్ లో మళ్ళీ కుండపోత వర్షం కురుస్తోంది నగరంలోని పలు ప్రాంతాలలో కుండపోత వర్షం కారణంగా ప్రజలంతా ఎక్కడి కక్కడ స్తంభించి పోయారు. పలు ప్రధాన రహదారులలో వరదనీటితో రోడ్లనీ చెరువుల్ని తలపిస్తున్నాయి. రోడ్లపై రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. అసలే రాఖీ పౌర్ణమి పర్వదినం కావడంతో జనమంతా తమ సహోదరులకు రాఖీ కట్టడానికి బయటకు వెళ్లి ఉన్నారు. వర్షం ధాటికి ఎక్కడి వారు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. రోడ్లపై తడుస్తూ వెళుతున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Hyderabad లో మళ్ళీ కుండపోత వర్షం
Leave a Comment