Hyderabad జిల్లా కాంగ్రేస్ కార్యదర్శిగా డల్లు శివ

హైదరాబాద్ , మార్చి 27 (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్ జిల్లా కాంగ్రేస్ కమిటీ కార్యదర్శిగా పాతబస్తీ గౌలిపుర ప్రాంతానికి చెందిన ఆర్. శివ కుమార్ (డల్లు) ను నియమిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షులు సయ్యద్ ఖాలెద్ సైఫుల్లా ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రేస్ పార్టీలో పనిచేసిన కార్యకర్తలకు ఎల్లవేళలా గుర్తింపు ఉంటుందని హైదరాబాద్ జిల్లా కాంగ్రేస్ కమిటీ కార్యదర్శిగా నియమితులైన ఆర్. శివ కుమార్ (డల్లు) తెలిపారు. తనపై నమ్మకముతో పార్టీ పెద్దలు ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి వెళ్లేలా ప్రయత్నిస్తానని అన్నారు. తనకు కార్యదర్శిగా గుర్తింపు లభించడం పట్ల పీసీసీ అధ్యక్షులు బొమ్మ కంటి మహేష్ కుమార్ గౌడ్ పార్టీ సీనియర్ నాయకులు వి. హనుమంత్ రావు, వైద్య శాఖ మంత్రి వర్యులు దామోదర రాజ నర్సింహా కు రాజ్య సభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ లకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేశారు. డీసీసీ అధ్యక్షులు సయ్యద్ ఖాలెద్ సైఫుల్లా ఇతర పార్టీ శ్రేణులకు కూడా డల్లు శివ కృతఙ్ఞతలు తెలిపారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....