Heroine మృణాల్‌ ఠాకూర్‌ Birthday – ప్లజంట్‌ పోస్టర్‌ తో విషెస్‌

హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ పుట్టిన రోజు సందర్భంగా ప్లజంట్‌ పోస్టర్‌ తో విషెస్‌ తెలిపిన ‘హాయ్‌ నాన్న’ టీమ్‌ ప్రత్యేక విషెస్ తెలిపింది. నేచురల్‌ స్టార్‌ నాని, నూతన దర్శకుడు శౌర్యువ్‌ దర్శకత్వంలో చేస్తున్న కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘హాయ్‌ నాన్న’. ఈ చిత్రం గ్లింప్స్‌ కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. టీజర్‌ చివర్లో మృణాల్‌ ఠాకూర్‌ నానిని ‘హాయ్‌ నాన్నా’ అని పిలవడం క్యురియాసిటీని పెంచింది. గ్లింప్స్‌ సీక్వెన్స్‌ చూడడానికి అందంగా ఉండటంతో పాటు సినిమాలో వారి రిలేషన్‌ గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తిని రేకెత్తించింది.ఈ రోజు మృణాల్‌ ఠాకూర్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్‌  సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. మృణాల్‌ కర్షణీయమైన చిరునవ్వుతో కనిపించగా, నాని బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించారు. చెవిపోగులు, ముక్కుపుడక ధరించింది మోడిష్‌ లుక్‌ లో ఆకట్టుకున్నారు మృణాల్‌.వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మోహన్‌ చెరుకూరి (సివిఎం), డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.ఈ పాన్‌ ఇండియా ఎంటర్‌ టైనర్‌ కి ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ సంగీతం అందించగా, సాను జాన్‌ వరుగీస్‌ ఎూఅ సినిమాటోగ్రఫర్‌ గా పని చేస్తున్నారు. ప్రవీణ్‌ ఆంథోని ఎడిటర్‌ గా, అవినాష్‌ కొల్లా ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా, సతీష్‌ ఈవీవీ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ గా పని చేస్తున్నారు.  

’హాయ్‌ నాన్న’ ఈ ఏడాది డిసెంబర్‌ 21న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తారాగణం: నాని, మృణాల్‌ ఠాకూర్‌  

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....