‘హే భగవాన్‌!’ Shooting పూర్తి` 2026 లో Grand గా రిలీజ్‌

సినిమా ప్రతినిధి, జనవరి 2,(ఇయ్యాల తెలంగాణ) : సుహాస్‌, గోపి అచ్చర, బి నరేంద్ర రెడ్డి, త్రిశూల్‌ విజనరీ స్టూడియోస్‌ ‘హే భగవాన్‌!’ షూటింగ్‌ పూర్తి` 2026 లో గ్రాండ్‌ గా రిలీజ్‌

సుహాస్‌ యూనిక్‌ స్క్రిప్ట్‌లతో అలరిస్తున్నారు. ప్రస్తుతం నూతన దర్శకుడు గోపి అచ్చర దర్శకత్వంలో  ‘హే భగవాన్‌!’ సినిమా చేస్తున్నారు. ఈ కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌ను త్రిశూల్‌ విజనరీ స్టూడియోస్‌ బ్యానర్‌పై బి. నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు, ఇది వారి ప్రొడక్షన్‌ నంబర్‌ 2. రైటర్‌ పద్మభూషణ్‌ ఫేం షణ్ముక ప్రశాంత్‌ ఈ కథను రాశారు. ఇప్పటికే విడుదలైన టైటిల్‌ టీజర్‌ కి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. టీజర్‌ లో సస్పెన్స్‌, కామెడీ అదిరిపోయింది.తాజాగా ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. చిత్ర బృందం నూతన సంవత్సరం సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక వీడియో అందరినీ ఆకట్టుకుంది.

ఈ చిత్రంలో శివాని నగరం హీరోయిన్‌ గా నటిస్తున్నారు. డా. నరేష్‌ వికె, సుదర్శన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రానికి డీవోపీ మహి రెడ్డి పండుగల, సంగీతం వివేక్‌ సాగర్‌, ఎడిటర్‌ విప్లవ్‌ నిషాదం, ఆర్ట్‌ డైరెక్టర్‌ ఎ రామ్‌ కుమార్‌.’హే భగవాన్‌’ 2026 లో గ్రాండ్‌ గా రిలీజ్‌ కానుంది.

తారాగణం: సుహాస్‌, శివాని నగరం, నరేష్‌, సుదర్శన్‌, అన్నపూర్ణమ్మ, తదితరులు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....