సినిమా ప్రతినిధి, జనవరి 2,(ఇయ్యాల తెలంగాణ) : సుహాస్, గోపి అచ్చర, బి నరేంద్ర రెడ్డి, త్రిశూల్ విజనరీ స్టూడియోస్ ‘హే భగవాన్!’ షూటింగ్ పూర్తి` 2026 లో గ్రాండ్ గా రిలీజ్
సుహాస్ యూనిక్ స్క్రిప్ట్‌లతో అలరిస్తున్నారు. ప్రస్తుతం నూతన దర్శకుడు గోపి అచ్చర దర్శకత్వంలో ‘హే భగవాన్!’ సినిమా చేస్తున్నారు. ఈ కంప్లీట్ ఎంటర్టైనర్ను త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి. నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు, ఇది వారి ప్రొడక్షన్ నంబర్ 2. రైటర్ పద్మభూషణ్ ఫేం షణ్ముక ప్రశాంత్ ఈ కథను రాశారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ లో సస్పెన్స్, కామెడీ అదిరిపోయింది.తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. చిత్ర బృందం నూతన సంవత్సరం సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక వీడియో అందరినీ ఆకట్టుకుంది.
ఈ చిత్రంలో శివాని నగరం హీరోయిన్ గా నటిస్తున్నారు. డా. నరేష్ వికె, సుదర్శన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రానికి డీవోపీ మహి రెడ్డి పండుగల, సంగీతం వివేక్ సాగర్, ఎడిటర్ విప్లవ్ నిషాదం, ఆర్ట్ డైరెక్టర్ ఎ రామ్ కుమార్.’హే భగవాన్’ 2026 లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
తారాగణం: సుహాస్, శివాని నగరం, నరేష్, సుదర్శన్, అన్నపూర్ణమ్మ, తదితరులు
