హైదరాబాద్, జూలై 8, (ఇయ్యాల తెలంగాణ ):తెలంగాణ గ్రూప్`1 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు జులూ 7న విడుదలైన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. అయితే తాజా ఫలితాల్లో ఖమ్మం పట్టణానికి చెందిన తండ్రి, కొడుకులు అర్హత సాధించారు. దాసరి రవికిరణ్ ముచ్చర్ల (53) అనే వ్యక్తి జాస్తిపల్లి ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కుమారుడు మైకేల్ ఇమ్మానియేలు (25) దూర్యవిద్యలో డిగ్రీ పూర్తి చేశారు. ఇటీవల తెలంగాణలో నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్‌కు మైకెల్‌తోపాటు అతని తండ్రి రవి కిరణ్ కూడా దరఖాస్తు చేసుకున్నారు.53 ఏళ్ల వయస్సున్న రవికిరణ్ కుమారుడికి అవసరమైన సూచనలు ఇవ్వడంతోపాటు.. తానూ పరీక్ష రాశారు. కుమారుడికి ఇన్పిరేషన్‌గా ఉండేందుకు ఆయన ఈ పరీక్ష రాశాడు. రిజర్వేషన్, ఇన్ సర్వీసు కోటాలో వయో మినహాయింపు ఉండటంతో ఆయన పరీక్ష రాయగలిగారు. అయితే అనూహ్యంగా ఆదివారం వెలువడిన ప్రిలిమ్స్ ఫలితాల్లో కుమారుడితోపాటు తండ్రి కూడా మెయిన్స్‌కు క్వాలిఫై కావడంతో ఒక్కసారిగా రాష్ట్రం అంతటా వీరి పేర్లు మారుమ్రోగిపోయాయి.
