Grand గా దిల్‌ సే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ – August 4న విడుదల

 గ్రాండ్‌ గా దిల్‌ సే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌, ఆగస్ట్‌ 4న థియేటర్స్‌ లో విడుదల !!!

శ్రీ చైతన్య క్రియేషన్స్‌, శ్రీరామ్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌ పై అభినవ్‌ మదిశెట్టి , స్నేహ సింగ్‌ హీరో హీరోయిన్లు గా మంకల్‌ వీరేంద్ర , రవికుమార్‌ సబ్బాని స్వీయ దర్శకత్వంలో వస్తోన్న సినిమా దిల్‌ సే. ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీతో వస్తోన్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకొని ఆగస్ట్‌ 4న థియేటర్స్‌ లో విడుదల కాబోతోంది.ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌ లో గ్రాండ్‌ గా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ తో పాటు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కుమారుడు పి. కౌశిక్‌ రెడ్డి, నిర్మాత బెక్కం వేణు గోపాల్‌ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా  పి. కౌశిక్‌ రెడ్డి మాట్లాడుతూ… 

దిల్‌ సే సినిమా టీజర్‌, సాంగ్స్‌, ట్రైలర్‌ చేశాం, మేకింగ్‌ బాగుంది ప్రొడక్షన్‌ వాల్యూస్‌ బాగున్నాయి. మా నిర్మాత మక్కల్‌ వీరేంద్ర గారు మంచి సినిమాలు చెయ్యాలని ఇండస్ట్రీకి వచ్చారు. దిల్‌ సే సినిమా తనకు మంచి పేరుతో పాటుగా గుర్తింపు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను, అలాగే ఈ సినిమాలో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్‌ అందరికి బెస్ట్‌ విషెస్‌ తెలుపుతున్నాను , ఆగస్ట్‌ 4న విడుదల కాబోతున్న దిల్‌ సే సినిమాను ప్రేక్షకులలు థియేటర్‌ లో చూసి ఎంజాయ్‌ చేస్తారని ఆశిస్తున్నన్నాను అన్నారు.

దిల్‌ సే సినిమాకు నూతన సంగీత దర్శకుడు శ్రీకర్‌ సంగీతం అందించాడు, యూత్‌ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ కు కూడా నచ్చే విధంగా ‘దిల్‌ సే’ ఉండబోతుందని చిత్ర యూనిట్‌ ఈ ఈవెంట్‌ లో తెలిపారు. ఒన్‌ విూడియా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల ఆగస్ట్‌ 4న విడుదల చెయ్యబోతోంది. 

నటీనటులు:

అభినవ్‌ మేడిశెట్టి, సశ్య సింగ్‌, లవ్లీ సింగ్‌, విస్మయ శ్రీ, వెంకటేష్‌ కాకుమాను తదితరులు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....