Govt పథకాల పేరుతో Cyber నేరగాళ్ల మోసాలు..

👉 సైబర్‌ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

👉 మోసపోవడానికి ప్రధాన కారణం…. అత్యాశ, అశ్రద్ద…

👉 మోసగాళ్ళ మాటలు నిజమని నమ్మకండి.పథకాల పేరుతో వచ్చే  తెలియని  ఫేక్‌ లింకులను క్లిక్‌ చేయవద్దు.

👉 బ్యాంకు ఖాతాల ఓటిపిలు చెబితే మోసపోతారు… జాగ్రత్త!…

👉 డీఐజీ , కర్నూలు జిల్లా ఇన్‌ చార్జ్‌ ఎస్పీ   విక్రాంత్‌ పాటిల్‌ 

కర్నూలు, జనవరి 16, (ఇయ్యాల తెలంగాణ) : ప్రభుత్వ పథకాలైన పీఎం కిసాన్‌, ముద్ర లోన్స్‌, సూర్యఘర్‌, అమ్మవడి వంటి పథకాల పేరుతో  సోషల్‌ విూడియాలో  ఫేక్‌ లింకులను పంపి సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని , ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఐజీ , కర్నూలు జిల్లా ఇన్‌ చార్జ్‌ ఎస్పీ   విక్రాంత్‌ పాటిల్‌ శుక్రవారం తెలిపారు. ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారిని ఎంచుకొని మోసాలకు పాల్పడుతున్నారని,  ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆయా పథకాల పేరుతో మొబైల్‌ కు వచ్చే తెలియని , ఫేక్ల్‌ లింకులను క్లిక్‌ చేయవద్దన్నారు. ఓటీపీలు చెబితే మోసపోయే అవకాశం ఉందని హెచ్చరించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....