GHMC ముందు TPCC ధర్నా

హైదరాబాద్‌జులై 28, (ఇయ్యాల తెలంగాణ ):శుక్రవారం నాడు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్యాలయం ముట్టడి జరిగింది. అంతకుముందు గన్‌ పార్క్‌ నుంచి గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తరువాత జిహెచ్‌ఎంసి ఆఫీస్‌ ముందు ధర్నాచేసి  కమిషనర్‌ కు వినతిపత్రం ఇచ్చారు. వరదలల్లో జనం అల్లాడుతుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్‌ నేతలు  ఆరోపించారు. హైదరాబాద్‌ వరద బాధిత కుటుంబాలకు పది వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్‌ చేసారు. ఈ నేపధ్యంలో జిహెచ్‌ఎంసి కార్యాలయం వద్ద తీవ్ర తోపులాట ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులను నాయకులను అరెస్టు చేసారు. కాంగ్రెస్‌ శ్రేణులు భారీగా తరలి  రావడంతో తీవ్రంగా ట్రాఫిక్‌ జాం అయింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....