
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (ఇయ్యాల తెలంగాణ) : తెలుగు రాష్ట్రాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి సర్వసిద్దమైయ్యింది. అత్యంత వైభవంగా ఈ ఏడాది గణేష్ శోభాయాత్ర, నిమజ్జనం నిర్వహించేందుకు ఇప్పటికే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీ ఏర్పాట్లు చేశారు. నగర వ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుండి ట్యాంక్ బండ్ వైపు భారీ గణేష్ విగ్రహాలు ర్యాలీగా రానున్న నేపధ్యంలో నగర వ్యాప్తంగా 6వ తేది ఉదయం 6గంటల నుండి 7వ తేది ఉదయం 10 గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. భారీ గణనాధుల శోభాయాత్రకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, పక్కా ప్రాక్కా ప్లాన్ తో ప్రధాన రహాదారుల విూదుగా రూట్ మ్యాప్ సిద్దం చేశారు.
బాలాపూర్ నుండి శోభాయాత్రగా బయలుదేరే బాలాపూర్ గణపతి విగ్రహం చార్మినా?ర్ , అబిడ్స్ ,లిబర్టీ , ట్యాంక్ బండ్ విూదుగా నక్సెల్స్ రోడ్ కు చేరుకుంటుంది. నక్సెల్స్ రోడ్ వద్ద హుస్సెన్ సాగర్ లో నిమజ్జన కార్యక్రమం పూర్తి చేస్తారు. సికింద్రాబాద్ నుండి హుస్సెస్ సాగర్ వైపు తరలి వచ్చే గణేష్ విగ్రహాలు ప్యాట్నీ , ప్యారడైజ్ , రాణిగంజ్, కర్బలా మైదాన్ విూదుగా ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంటాయి. ఎల్బీనగర్ విూదుగా వచ్చే గణపతి విగ్రహాలు దిల్ షుక్ నగర్ , అంబర్ పేట్, నారాయణ గూడ, ఉప్పల్ విూదుగా వచ్చి లిబర్టీ వద్ద శోభాయాత్రలో కలసి అక్కడి నుండి నేరుగా హుస్సెన్ సాగర్ వద్దకు చేరుకుంటాయి. టోలీ చౌకీ , మెహదీపట్నం విూదుగా వచ్చే విగ్రహాలు ఖైరతాబాద్ విూదుగా నెక్లెస్ రోడ్డులో నిమజ్జనం పాయింట్ వద్దకు చేరుకుంటాయి. ఆసీఫ్ నగర్ నుండి వచ్చే విగ్రహాలు ఎంజే మార్కెట్ వద్ద శోభాయాత్రలో కలుస్తాయి.
హైదరాబాద్ గణేష్ నిమజ్జనం రూట్ మ్యాప్.. ట్రాఫిక్ మళ్లింపు, ఆర్టీసి బస్సులకు సైతం ఆంక్షలు
6వ తేది (శనివారం ) ఉదయం నుండి మరుసటి రోజు ఉదయం 10గంటల వరకూ ఇతర వాహనాలను నగరంలో ప్రధాన రహదారులపైకి అనుమతించరు.
సౌత్ జోన్ ఈస్ట్ పరిధిలో ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్లు.. కేశవగిరి, చంద్రాయాణగుట్ట, మూసారాంబాగ్, చంచల్ గూడ
సౌత్ జోన్ డైవర్షన్ పాయింట్లు.. ఆలియా బాద్, మదీనా, నయాపూర్ , ఎంజే మార్కెట్, దరుశ్శిఫా
ఈస్ట్ జోన్ డైవర్షన్ పాయింట్లు.. శివాజీ బ్రిడ్జి, పుత్లీబౌలీ, హిమాయత్ నగర్, వైఎంసిఎ
సెంట్రల్ జోన్ డైవర్షన్ పాయింట్లు.. లిబర్టీ, అబిడ్స్ , ఖైరతాబాద్ , ట్యాంక్ బండ్ , బుద్దభవన్
నార్త్ జోన్ డైవర్షన్ పాయింట్లు.. పాట్నీ, పారడైజ్, రాణిగంజ్
హుస్సేస్ సాగర్ వద్ద విగ్రహాల నిమజ్జనం కోసం భారీగా వాహనాలు ట్యాంక్ బండ్ వద్దకు రానున్న నేపధ్యంలో ప్రత్యేక పార్కింగ్ ప్రదేశా?లను కేటాయించారు. ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ గుడి, పబ్లిక్ గార్డెన్స్, బుద్దభవన్ వెనుక, ఆదర్శ నగర్ , బిఆర్ కే భవన్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్ ల వద్ద నిమజ్జనాకి? వచ్చే వాహనాల పార్కింక్ చేసుకోవచ్చు.నిమజ్జనం పూర్తి చేసుకున్న తరువాత భారీ వాహనాలు, లారీలు నగరంలోకి రాకుండా ,అవుటర్ రింగ్ రోడ్డు విూదుగా వెళ్లేలా దారిమళ్లించనున్నారు. 6వ తేది ఉదయం 8గంటల నుండి 11వతేది ఉదయం 11గంటల వరకూ లారీలకు నగరంలోకి అనుమతి లేదు. నిమజ్జన నేపధ్యంలో ఆర్టీసి బస్సులకు సైతం ఆంక్షలు తప్పలేదు. రద్దీ ఎక్కువగా ఉన్న సమాయాల్లో ఆర్టీసి బస్సులను మెహదీపట్నం, కూకట్ పల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, దిల్ షుక్ నగర్ , నారాయణగూడ వరకే పరిమితం చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వచ్చే ఆర్టీసీ బస్సులను చాధర్ ఘట్ వైపు దారిమళ్లించనున్నారు. ఈ జంక్షన్ల వైపు నో ఎంట్రీ.. ఎంజే మార్కెట్, ఖైరతాబాద్, అబిడ్స్, లిబర్టీ, రాణిగంజ్ , తెలుగుతల్లి చౌరస్తా, ట్యాంక్ బండ్, నక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా..
విమానాశ్రయం వెళ్లేవారు పివిఎన్ ఆర్ ఎక్స్ ప్రెస్ ఫ్లైఓవర్ లేదా అవుట్ రింగ్ రోడ్ మాత్రమే ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్లేవారు బేగంపేట్ , ప్యారడైజ్ రూట్ వాడుకోవాలి. ఇదిలా ఉంటే నిమజ్జనం కోసం ప్రత్యేకంగా 10 బేబి పాండ్లు, పొర్టబుల్ వాటర్ ట్యాంక్ లు 8, ఎక్స్ వేషన్ పాండ్లు 8 ఏర్పాటు చేశారు.
నిమజ్జనం సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే స్పందించేందుకు ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ ను ఏర్పాటు చేశారు. హెల్ప్ లైన్ నెంబర్లు : 040` 27852482 , 8712660600 , 9010203626