G20 సమావేశాలకు స్కల్జ్‌ – కంటికి ఐప్యాచ్‌ – అయినా Attend

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 9 (ఇయ్యాల తెలంగాణ) : జర్మనీ ఛాన్సలర్‌ ఓలాఫ్‌ స్కల్జ్‌ ఢిల్లీ లో జరుగుతున్న జీ20 సమావేశాలకు హాజరయ్యారు. భారత మండపంలో ఉన్న కోణార్క్‌ వీల్‌ వద్ద ఇవాళ ఆయనకు ప్రధాని మోదీ షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి స్వాగతం పలికారు. ఆ సమయంలో స్కల్జ్‌.. తన కంటికి ఐప్యాచ్‌ ధరించి ఉన్నారు. సాధారణంగా కంటి ఆపరేషన్‌ చేయించుకున్న వాళ్లు ధరించే నల్ల రంగు ప్యాచ్‌ను స్కల్జ్‌ తన కంటికి ధరించారు. అయితే దీనిపై ఆ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 65 ఏళ్ల ఛాన్సలర్‌ గత వారం జాగింగ్‌ చేస్తూ గాయపడినట్లు ప్రతినిధి తెలిపారు. దీని వల్ల ఆయన కుడి కన్ను దెబ్బతిన్నది. స్వల్ప స్థాయిలో ఆయన కంటికి గాయాలయ్యాయని, మరికొన్ని రోజుల పాటు స్కల్జ్‌ ఆ బ్లాక్‌ కలర్‌ ఐ ప్యాచ్‌ ధరించాల్సి ఉంటుందని ప్రతినిధి తెలిపారు. ఎన్నో ఏళ్ల నుంచి ప్రతి రోజూ జాగింగ్‌ చేసే అలవాటు ఛాన్సలర్‌ స్కల్జ్‌కు ఉన్నట్లు ప్రతినిధి స్టీఫెన్‌ హెబిస్ట్రెయిట్‌ తెలిపారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....