ఫీల్‌ గుడ్‌ Love Story ‘మరొక్కసారి’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌

నరేష్‌ అగస్త్య, సంజనా సారథి ప్రధాన పాత్రల్లో నటించిన ఫీల్‌ గుడ్‌ లవ్‌స్టోరీ ‘మరొక్కసారి’. సి.కె.ఫిల్మ్‌ మేకర్స్‌ బ్యానర్‌పై బి.చంద్రకాంత్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం నితిన్‌ లింగుట్ల. ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను కంప్లీట్‌ చేసుకుంటోంది. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది.

‘మరొక్కసారి’ మూవీకి భరత్‌ మాంచి రాజు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో మొత్తంగా ఆరు పాటలుంటాయి. ఈ పాటను టాలీవుడ్‌ టాప్‌ సింగర్లు ఆలపించారు. ప్రముఖ గాయకులు కార్తిక్‌, ప్రదీప్‌ కుమార్‌, దేవన్‌ ఏకాంబరం, జాస్సీ గిఫ్ట్‌ వంటి వారు పాటల్ని పాడారు. ఇప్పటికే పాటలకు సంబంధించిన చిత్రీకరణ కూడా పూర్తయింది. అందమైన ప్రేమ కథా చిత్రానికి విజువల్స్‌ మరింత అందాన్ని తీసుకు రాబోతోన్నాయి. ఈ చిత్రాన్ని కేరళ, సిక్కిం, టిబెట్‌ సరిహద్దు ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఇంత వరకు ఏ ఇండియన్‌ సినిమా కూడా షూటింగ్‌ చేయనటువంటి గురుడోంగ్మార్‌ లేక్‌ వంటి ప్రదేశంలో ఈ ‘మరొక్కసారి’ చిత్రీకరణ జరుపుకుంది.

5,430 విూ. ఎత్తులో ఉండే గురుడోంగ్మార్‌ లేక్‌లో షూటింగ్‌ చేసిన ఏకైక, మొట్టమొదటి ఇండియన్‌ మూవీగా ‘మరొక్కసారి’ నిలిచింది. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్‌ వచ్చింది. తాజాగా రిలీజ్‌ చేసిన టైటిల్‌ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ పోస్టర్‌ను చూస్తుంటే ఓ ఆహ్లాదకరమైన ప్రేమ కథను చూడబోతోన్నామని అర్థం అవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే చిత్రానికి సంబంధించిన రిలీజ్‌ డేట్‌ను ప్రకటించనున్నారు.ఈ చిత్రంలో నరేష్‌ అగస్త్య, సంజనా, బ్రహ్మాజీ, సుధర్షన్‌, వెంకట్‌, వెంకట్‌ కాకమాను, దివ్యవాణి తదితరులు నటించారు. ఈ మూవీకి కెమెరామెన్‌గా రోహిత్‌ బచు, సంగీత దర్శకుడిగా భరత్‌ మాంచిరాజు, ఎడిటర్‌గా చోటా కే ప్రసాద్‌ పని చేస్తున్నారు.

నటీనటులు : నరేష్‌ అగస్త్య, సంజనా, బ్రహ్మాజీ, సుధర్షన్‌, వెంకట్‌, వెంకట్‌ కాకమాను, దివ్యవాణి తదితరులు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....