February 29న ‘గామి’

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌, విద్యాధర్‌ కాగిత, కార్తీక్‌ శబరీష్‌, వి సెల్యులాయిడ్‌ ‘గామి’ నుంచి జాహ్నవిగా వెరీ టాలెంటెడ్‌ చాందిని చౌదరి ఫస్ట్‌ లుక్‌ విడుదల

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ మోస్ట్‌ ఎవైటెడ్‌ అడ్వెంచర్‌ డ్రామా ‘గామి’ థియేట్రికల్‌ ట్రైలర్‌ మరో వారంలో ఫిబ్రవరి 29న విడుదల కానుంది. వెరీ టాలెంటెడ్‌ చాందినీ చౌదరి ఈ సినిమాలో కథానాయిక.ఈరోజు పోస్టర్‌ ద్వారా చాందిని పాత్రను జాహ్నవిగా పరిచయం చేస్తూ ఫస్ట్‌ లుక్‌ ని రిలీజ్‌ చేశారు. చాందిని కళ్లజోడుతో పెక్యులర్‌ గా వున్న ఫస్ట్‌ లుక్‌ ఆకట్టుకుంది. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో ఆమె వీధుల్లో నడుస్తూ కనిపించింది. చాందినితో పాటు విశ్వక్‌ చేసిన సాహస యాత్రను సినిమాలో అద్భుతంగా చూపించనున్నారు.మానవ స్పర్శను అనుభవించలేని అరుదైన వ్యాధితో బాధపడే అఘోరా పాత్రలో విశ్వక్‌ సేన్‌ నటించారు. విద్యాధర్‌ కాగిత దర్శకత్వంలో కార్తీక్‌ కుల్ట్‌ క్రియేషన్స్‌పై కార్తీక్‌ శబరీష్‌ నిర్మించిన ఈ చిత్రానికి క్రౌడ్‌ ఫండ్‌ చేశారు. వి సెల్యులాయిడ్‌ సమర్పిస్తుంది.హారిక పెడాడ, మహ్మద్‌ సమద్‌ ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ విశ్వనాథ్‌ రెడ్డి, రాంపీ నందిగాం అందిస్తున్నారు. నరేష్‌ కుమారన్‌ మ్యూజిక్‌. విద్యాధర్‌ కాగిత, ప్రత్యూష్‌ వత్యం స్క్రీన్‌ ప్లే సమకూరుస్తున్నారు.గామి మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 తారాగణం:` విశ్వక్‌ సేన్‌, చాందిని చౌదరి, ఎంజీ అభినయ, హారిక పెడదా, మహ్మద్‌ సమద్‌

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....