దుమ్ము రేపిన Anushka యాక్షన్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 5 (ఇయ్యాల తెలంగాణ) : అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహించిన సినిమా ‘ఘాటీ’. ఇందులో విక్రమ్‌ ప్రభు హీరో. చైతన్య రావు ` రవీంద్ర విజయ్‌ విలన్లు. జగపతి బాబు కీలక పాత్రలో నటించారు. ‘వేదం’ వచ్చిన పదిహేనేళ్ళకు అనుష్క, క్రిష్‌ కలిసి చేసిన చిత్రమిది. టీజర్‌, ట్రైలర్లు సినిమాపై ఆసక్తి పెంచాయి. యాక్షన్‌ బాటలోకి క్రిష్‌ వచ్చారని చెప్పాయి. మరి సినిమా ఎలా ఉంది? రివ్యూలో తెలుసుకోండి.

కథ : కాష్ఠాల నాయుడు (రవీంద్ర విజయ్‌), కుందుల నాయుడు (చైతన్య రావు) తప్ప ఆంధ్రా ` ఒరిస్సా సరిహద్దుల్లోని తూర్పు కనుమ కొండల్లో (ఘాట్లలో) మరొకరు మేలిమి రకం గంజాయి ‘శీలావతి’ని సాగు చేయడానికి వీల్లేదు. ఒకవేళ వాళ్ళను కాదని ఎవరైనా సాగు చేస్తే అతి క్రూరంగా చంపేస్తారు. అంతలా ఘాట్లను తమ గుప్పిట్లో పెట్టుకుంటారు.తండ్రి మరణం తర్వాత తల్లికి ఇచ్చిన మాట కోసం గంజాయి మూసే ఘాటీ పని వదిలేసిన ల్యాబ్‌ టెక్నీషియన్‌ దేశిరాజు (విక్రమ్‌ ప్రభు), అతని మరదలు ` బస్‌ కండక్టర్‌ శీలావతి (అనుష్క)ను నాయుడు బ్రదర్స్‌ ఎందుకు టార్గెట్‌ చేశారు? ఓ సాధారణ ఘాటీ నుంచి ఘాటీలను ఏకం చేసే నాయకురాలిగా శీలావతి ఎలా ఎదిగింది? ఈ ప్రయాణంలో పోలీస్‌ విశ్వదీప్‌ రావత్‌ (జగపతి బాబు), మాజీ మిస్‌ ఇండియా నీరాలి (లారిస్సా బోనెసి), మహావీర్‌ (జిష్షుసేన్‌ గుప్తా) పాత్ర ఏమిటి? వాళ్ళు ఎవరు? అనేది సినిమా.

విశ్లేషణ  

పాన్‌ ఇండియా మత్తులో పడి తెరపై కొత్త ప్రపంచం ఆవిష్కరించాలని దర్శక రచయితలు ప్రయత్నిస్తున్నారు. అందులో తప్పు లేదు. అయితే ఆ ప్రయత్నంలో విజయం రుచి చూస్తున్నది కొంత మంది మాత్రమే. కొత్త ప్రపంచం మత్తు ` మాయలో పడి నేల విడిచి సాము చేయడం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. ‘ఘాటీ’ కూడా ఆ కోవలోకి వచ్చే చిత్రమే.కథకుడిగా, దర్శకుడిగా క్రిష్‌ విూద ప్రేక్షకుల్లో గౌరవం ఉంది. అందుకు ప్రధాన కారణం… ఆయన సినిమాల్లో భావోద్వేగాలు. ‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’, ‘కంచె’ వరకు పాన్‌ ఇండియా కోసం క్రిష్‌ సినిమాలు తీయలేదు. కానీ ఆయా సినిమాల్లో కొత్త ప్రపంచాలను చూపించారు. మనం చూసే కథలను కొత్త కోణాల్లో చూపించారు. బలమైన భావోద్వేగాలను ప్రేక్షకుల మనసుకు తాకేలా, తెరపై జరిగే కథ మనది అనుకునేలా చెప్పారు. ‘ఘాటీ’లోనూ కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించారు. కానీ ఆ కథలో భావోద్వేగాలు ఏ దశలోనూ బలంగా తాకేలా తీయలేదు.’ఘాటీ’ ఆసక్తికరంగా మొదలైంది. ఘాట్స్‌, హీరో హీరోయిన్లతో పాటు క్యారెక్టర్స్‌ పరిచయం వరకు బావుంది. అయితే అక్కడ నుంచి కథ ముందుకు కదల్లేదు. సగటు సినిమాలు చూసే ప్రేక్షకులు ఎవరికైనా సరే ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ ఊహకు అందుతుంది. గంజాయిని గ్లోరిఫై చేయలేదని దర్శక నిర్మాతలు చెప్పిన తర్వాత ఇంటర్వెల్‌ తర్వాత క్లైమాక్స్‌ వరకు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం కాదు. కథ ఊహకు అందేటప్పుడు కథనం, సన్నివేశాలు ప్రేక్షకుల చూపు కట్టిపడేలా ఉండాలి.

‘ఘాటీ’లో అలా జరగలేదు. క్రిష్‌ మంచి సన్నివేశాలు రాసుకున్నారు. కానీ షీరోయిజం తెరపైకి సరిగా రాలేదు. బలమైన వ్యవస్థకు వ్యతిరేకంగా ఓ సామాన్య మహిళ చేసే పోరాటం ‘ఘాటీ’.ఆ ప్రయాణం భావోద్వేగ భరితం గా , ఉద్విగ్నం కలిగించేలా ఉండాలి. అనుష్క పోరాటం ఆ విధంగా లేదు.చింతకింది శ్రీనివాసరావు కథలో గంజాయికి వ్యతిరేకంగా సమాజానికి సందేశం ఇవ్వాలనే తపన కనిపించింది. కానీ, ఆడియన్స్‌ కనెక్ట్‌ అయ్యేలా ఎమోషన్స్‌ రాలేదు. మెయిన్‌ క్యారెక్టర్లలో సడన్‌గా వచ్చే మార్పు నమ్మడం కష్టంగా ఉంటుంది. స్టోరీ, స్క్రీన్‌ ప్లేలో టూ మచ్‌ సినిమాటిక్‌ లిబర్టీ తీసుకున్నారు. లారిస్సా, జిష్షుసేన్‌ గుప్తా పాత్రలను సరిగా ఎస్టాబ్లిష్‌ చేయలేదు. కొన్ని క్యారెక్టర్స్‌ ఎండిరగ్‌ కూడా సరిగా లేదు. సాయి మాధవ్‌ బుర్రా మాటల్లో ‘సారా సొమ్ముతో స్కీములు’ వంటి చిన్న పొలిటికల్‌ పంచ్‌ సహా కొన్ని మంచి డైలాగులు ఉన్నాయి. అంతకు మించి గుర్తు పెట్టుకునే బలమైనవి మాత్రం లేవు. సంగీత దర్శకుడు విద్యాసాగర్‌ నాగవెల్లి అందించిన బాణీలు, నేపథ్య సంగీతం సూపర్‌. తూర్పు కనుమలను కెమెరామ్యాన్‌ మనోజ్‌ రెడ్డి కాటసాని చక్కగా చూపించారు. కొన్ని సన్నివేశాల్లో వీఎఫ్‌ఎక్స్‌ చేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది.

శీలావతి పాత్రలో అనుష్కను చూడటం కొత్తగా ఉంటుంది. ఇప్పటివరకు ఇంత రస్టిక్‌ డ రా రోల్‌ ఆవిడ చేయలేదు. యాక్షన్‌ సన్నివేశాలు బాగా చేశారు. అనుష్క యాక్షన్‌ వరకు ఓకే. ఫిమేల్‌ సెంట్రిక్‌ సినిమాల్లో హీరోలకు ఇంపార్టెన్స్‌ ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన పరిధి మేరకు విక్రమ్‌ ప్రభు చేశారు. రవీంద్ర విజయ్‌ ఇటువంటి విలన్‌ రోల్‌ చేయడం కొత్త కాదు. కానీ చైతన్య రావు సర్‌ప్రైజ్‌ చేశారు. స్టయిలిష్‌ విలన్‌ లుక్‌ అతనికి సెట్‌ అయ్యింది. నటుడిగా ఓకే. జగపతి బాబు, వీటీవీ గణేష్‌, జిష్షుసేన్‌ గుప్తా, లారిస్సా బోనేసి, రాజు సుందరం తదితరులు పాత్రల పరిధి మేరకు చేశారు. పుష్ప, దసరా తరహాలో రస్టిక్‌ అండ్‌ రా వరల్డ్‌ ఎంపిక చేసుకున్నారు క్రిష్‌. కానీ, ఆ స్థాయిలో సినిమాను మలచడంలో ఫెయిల్‌ అయ్యారు. ఇదొక రెగ్యులర్‌ రివేంజ్‌ డ్రామా. దీనికి సోషల్‌ మెసేజ్‌ యాడ్‌ చేశారు. కానీ సెట్‌ అవ్వలేదు. ‘ఘాటీ’తో అనుష్క ` క్రిష్‌ కాంబో డిజప్పాయింట్‌ చేసింది. కొన్ని యాక్షన్స్‌ సీన్స్‌ మాత్రమే మెప్పిస్తాయి

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....