హైదరాబాద్, జూలై 14 (ఇయ్యాల తెలంగాణ) : 50 సంవత్సరముల స్వర్ణోత్సవాల సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన మహాత్మ గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు, మహాత్మా చరఖా అవార్డుల ప్రధానోత్సవం కార్యకమంలో భాగంగా పలువురు ప్రతిభా వంతులకు పురస్కారాలు అందజేసింది. ఇందులో భాగంగా ఈ నెల 13 వ తేదీన గాంధీ భవన్ ప్రకాశం హాల్లో అవార్డు ప్రధానం చేసింది. హైదరాబాద్ జిల్లా సైన్స్ అధికారి సీ ధర్మేందర్ రావ్ సేవలను గుర్తించి మహాత్మా చరఖా అవార్డు ప్రధానం చేశారు. గాంధీ జ్ఞాన్ ప్రతి స్థాన్ , గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సందర్బంగా, గాంధీ భవన్ ప్రకాశం హాల్లో డాక్టర్ గున్నా రాజేందర్ రెడ్డి చైర్మన్ , డాక్టర్ గాంధారి ప్రభాకర్ కన్వీనర్, డాక్టర్ యానాలా ప్రభాకర్ రెడ్డీ సెక్రటరీ, జిల్లా సైన్స్ అధికారి సీ ధర్మేందర్ రావ్ సేవలకు గాను మహాత్మా చరఖా అవార్డు అందించింది ఈ మేరకు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చేతుల మీదుగా అవార్డును అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా సైన్స్ అధికారి ధర్మేందర్ రావు మాట్లాడుతూ తనకు మహాత్మ చరఖా అవార్డు లభించడం ఏంతో సంతోషంగా ఉన్నదని, కష్ట పడే వారికీ సమాజంలో ఎప్పటికి విలువ ఉంటుందని దీనికి ప్రస్తుతం నాకు అందించిన అవార్డు అని గుర్తు చేశారు. ఈ సందర్బంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్బంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ జేశారు.
- Homepage
- iyyala telangana
- జిల్లా సైన్స్ అధికారికి మహాత్మా చరఖా అవార్డు
జిల్లా సైన్స్ అధికారికి మహాత్మా చరఖా అవార్డు
Leave a Comment