Digital అరెస్ట్ పేరుతో రూ.1.07 కోట్ల మోసం.. !

👉 ఢిల్లీ ముఠాను పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు

👉 మోసానికి సహకరించిన ఢిల్లీకి చెందిన ముగ్గురు సభ్యుల అరెస్ట్

👉 ముంబై పోలీసులమంటూ బెదిరించి డబ్బులు కాజేసిన సైబర్ నేరగాళ్లు

👉 అమాయకుల బ్యాంకు ఖాతాలను వాడుకొని మోసాలకు పాల్పడుతున్న ముఠా

👉 అపరిచితులకు బ్యాంకు ఖాతాలు ఇవ్వొద్దని పోలీసుల హెచ్చరిక

హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ఇయ్యాల తెలంగాణ) : డిజిటల్ అరెస్ట్ పేరుతో నగరానికి చెందిన ఒక వ్యక్తిని భయపెట్టి రూ.1.07 కోట్లు కాజేసిన సైబర్ మోసంలో కీలకపాత్ర పోషించిన ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ డీసీపీ వి. అరవింద్ బాబు తెలిపారు. నిందితులు ఢిల్లీకి చెందిన వారని, వీరు మోసగాళ్లకు బ్యాంకు ఖాతాలను సరఫరా చేస్తూ ఈ నేరానికి సహకరించారని ఆయన వెల్లడించారు. ఇటీవల నగరానికి చెందిన బాధితుడికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు తాము ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులమని పరిచయం చేసుకున్నారు. అతని ఆధార్ కార్డు, ఫోన్ నంబర్‌పై మనీ లాండరింగ్ కేసు నమోదైందని, వెంటనే అరెస్ట్ చేస్తామని బెదిరించారు. విచారణ పేరుతో “డిజిటల్ అరెస్ట” చేసి, పలు దఫాలుగా రూ.1.07 కోట్లను వేర్వేరు బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు.

బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, డబ్బు బదిలీ అయిన ఖాతాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మొదట దీపక్, ప్రశాంత్ కుమార్ అనే ఇద్దరు ఖాతాదారులను అరెస్ట్ చేశారు. వారిచ్చిన సమాచారంతో, ఈ మోసానికి బ్యాంకు ఖాతాలను సరఫరా చేస్తున్న ప్రధాన సూత్ర ధారులు గుర్దీప్ సింగ్, హర్‌ప్రీత్ సింగ్, కుమార్ మోహిత్‌లను ఢిల్లీలో అరెస్ట్ చేశారు. ఈ ముఠా ఢిల్లీ, జైపూర్ వంటి నగరాల్లోని హోటళ్లలో ఉంటూ, డబ్బు అవసరం ఉన్నవారికి కవిÖషన్ ఆశ చూపి వారి బ్యాంకు ఖాతాలను సేకరించి మోసాలకు వాడుతున్నట్లు తేలింది. వీరికి గుజరాత్, కేరళ, మహారాష్ట్ర వంటి ఇతర రాష్టాల్లో జరిగిన సైబర్ నేరాలతోనూ సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు.ఈ సందర్భంగా డీసీపీ అరవింద్ బాబు మాట్లాడుతూ, “అపరిచితులకు కవిÖషన్ ఆశతో బ్యాంకు ఖాతాలు ఇస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. వ్యక్తిగత వివరాలు, ఓటీపీ, ఆధార్ వంటివి ఎవరితోనూ పంచుకోవద్దు” అని ప్రజలను హెచ్చరించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....