‘DG ప్లానెట్’ 5వ షోరూం – కర్మన్‌ఘాట్‌లో

హైదరాబాద్, మార్చి 25 (ఇయ్యాల తెలంగాణ) :  హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రానిక్స్ రంగంలో వేగంగా విస్తరిస్తున్న ‘డిజి ప్లానెట్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ మరో కొత్త అడుగు వేస్తోంది. కర్మన్‌ఘాట్‌లో చంపాపేట్ రోడ్డుపై బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఎదురుగా ఈ సంస్థ 5వ ఎలక్ట్రానిక్స్ షోరూంను ఈ నెల 28న సాయంత్రం 4 గంటలకు ఘనంగా ప్రారంభించనున్నట్లు సీఈఓ ముహమ్మద్ సలీం  ప్రకటించారు.

ఈ మేరకు చార్మినార్ షోరూంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఇప్పటికే చార్మినార్, అత్తాపూర్, మెహదీపట్నం, టోలిచౌకి ప్రాంతాల్లో నాలుగు షోరూంలు విజయవంతంగా కొనసాగుతున్నాయని చెప్పారు. వినియోగదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కర్మన్‌ఘాట్‌లో కొత్త బ్రాంచ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

దేశీయ, అంతర్జాతీయ ప్రముఖ కంపెనీలకు చెందిన మొబైల్స్,  పరికరాలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఈ షోరూంలో లభిస్తాయని తెలిపారు. అన్ని ఉత్పత్తులను అసలు ధరలకే అందిస్తూ, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.

ప్రారంభోత్సవ కార్యక్రమానికి విశిష్ట అతిథులు, స్థానిక ప్రముఖులు హాజరుకానున్నట్లు సలీం తెలిపారు. నగరంలో నాణ్యమైన సేవల ద్వారా సంస్థకు మరింత గుర్తింపు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన స్పష్టం చేశారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....