న్యూఢల్లీ జూన్ 28(ఇయ్యాల తెలంగాణ )2024 ఢల్లీ ఎయిర్ పోర్టులో రూఫ్ కూలిన ఘటనలో ఆరుగురికి గాయాలు అయ్యాయి. ఒకరు మృతి చెందారు. ఢల్లీలో కురుస్తున్న కుండపోత వర్షానికి ఈ ఘటన జరిగింది. పలు వాహనాలు, టాక్సీలు దెబ్బతిన్నాయి. ప్రమాద స్థి దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చెక్ ఇన్ కౌంటర్లు తాత్కాలికంగా మూసివేసారు. టెర్మినల్`1లో విమాన రాకపోకలు బంద్ అయ్యాయి.
ఎయిర్ పోర్టు ఘటనపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. సహాయక చర్యలు చురుకుగా కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించామని అన్నారు. తెల్లవారు జామున ప్రమాదం విషయం తెలియగానే అగ్ని మాపక శకటాలు టెర్మినల్ 1 వద్దకు చేరుకున్నాయి. ఒర రూఫ్ షీటు, సపోర్ట్ బీములు కూలిపోయాయి. ఢల్లీి పోలీసులు, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం, ఎన్డీఆర్ఎఫ్ దళాలు సహాయక చర్యల్లో పాల్గోంటున్నాయి.

.jpeg)
.jpeg)
