DELHI AIRPORT కూలిన ROOF

న్యూఢల్లీ జూన్ 28(ఇయ్యాల తెలంగాణ )2024 ఢల్లీ ఎయిర్‌ పోర్టులో రూఫ్‌ కూలిన ఘటనలో ఆరుగురికి గాయాలు అయ్యాయి. ఒకరు మృతి చెందారు. ఢల్లీలో కురుస్తున్న కుండపోత వర్షానికి ఈ ఘటన జరిగింది. పలు వాహనాలు, టాక్సీలు దెబ్బతిన్నాయి. ప్రమాద స్థి దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చెక్‌ ఇన్‌ కౌంటర్లు తాత్కాలికంగా మూసివేసారు. టెర్మినల్‌`1లో విమాన రాకపోకలు బంద్‌ అయ్యాయి.

ఎయిర్‌ పోర్టు ఘటనపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు స్పందించారు. సహాయక చర్యలు చురుకుగా కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించామని అన్నారు. తెల్లవారు జామున ప్రమాదం విషయం తెలియగానే అగ్ని మాపక శకటాలు టెర్మినల్‌ 1  వద్దకు చేరుకున్నాయి. ఒర రూఫ్‌ షీటు, సపోర్ట్‌ బీములు కూలిపోయాయి.  ఢల్లీి పోలీసులు, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం, ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలు సహాయక చర్యల్లో పాల్గోంటున్నాయి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....