DELHI హైవేపై రోడ్డు ప్రమాదం

న్యూఢల్లీ, నవంబర్‌ 9, (ఇయ్యాల తెలంగాణ ); ఢల్లీ ? జైపూర్‌ హైవేపై బుధవారం రాత్రి పెను ప్రమాదం చోటు చేసుకుంది. హైవేపై ఓ ప్రైవేట్‌ స్లీపర్‌ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో ఇద్దరు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. కాగా 12 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రయాణీకులను మేదాంత, సివిల్‌ ఆసుపత్రిలో చేర్పించి వైద్య చికిత్సనందిస్తున్నారు. అక్కడ నుండి కొందరిని ఢల్లీిలోని సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రికి మెరుగైన చికిత్స నిమిత్తం తరలించారు. అయితే గాయపడిన ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.సమాచారం ప్రకారం బుధవారం రాత్రి ప్రైవేట్‌ స్లీపర్‌ బస్సు ఢల్లీి`జైపూర్‌ హైవే విూద వెళుతోంది. కదులుతున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులకు ఏమి జరిగిందో అర్ధం చేసుకునే లోపునే మంటలు బస్సుని మొత్తం ఆక్రమించాయి. బస్సు పూర్తిగా దగ్ధమయింది. ప్రమాదం జరిగిన  సమయంలో కొందరు ప్రయాణికులు బస్సు ద్వారం నుంచి బయటకు రాగా.. కొందరు ప్రయాణికులు కిటికీ అద్దాలు పగలగొట్టి బయటకు వచ్చారు. అయితే కొంత మంది ప్రయాణికులు బస్సులోనే ఉండిపోయారు. హైవే విూద జరిగిన ఈ ప్రమాదాన్ని అటుగా వెళుతున్న ప్రజలు చూసి పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది చాలా శ్రమించి మంటలను అదుపు చేసి బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను రక్షించారు. దాదాపు 12 మంది ప్రయాణికులు కాలిపోగా..  పోలీసు బృందం వారిని అంబులెన్స్‌ సహాయంతో ఆసుపత్రికి తరలించారు. బస్సు లోపల తనిఖీ చేయగా ఇద్దరు ప్రయాణికుల మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసు బృందం మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. అయితే ప్రయాణికుల మృతదేహాలు కాలిపోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....