Delhi లో నీటి సంక్షొభం !

న్యూడిల్లీ, జూన్‌ 17, (ఇయ్యాల తెలంగాణ) :  ఢిల్లీ తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. యమునా నదికి నీటి ప్రవాహం తగ్గడంతో నీటి కోసం ఇబ్బందులు తప్పడం లేదు. నీరు దొరకక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇదే సమయంలో నీటి సరఫరా వ్యవస్థను దుండగులు ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ఘటనను కొన్ని ప్రాంతాల్లో జరుగుతుండగా ఢిల్లీ జల మంత్రిత్వ శాఖ కీలక చర్యలకు ఉపక్రమించిందినగరానికి వచ్చే పైపులైన్లకు పహారా కాయాలని విజ్క్షప్తి చేస్తూ పోలీస్‌ కమిషనర్‌కు లేఖ రాసారు. రాష్ట్రంలోని కీలకమైన వాటర్‌ పైపులైన్ల వద్ద మరో 15 రోజుల పాటు పోలీసు భద్రత పెంచాలని ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ ను కోరుతున్నాను. నగరానికి జీవనాధారంగా మారిన వాటర్‌ పైప్‌లైన్లను కొందరు వ్యక్తులు దుర్వినియోగం చేస్తున్నారు. దానిని ఆపడం చాలా ముఖ్యం. ప్రస్తుతం నగర ప్రజలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కుంటున్నారని మంత్రి అతిశీ లేఖలో తెలిపారు.

ఇదిలా ఉంటే ఆప్‌ ఎమ్మెల్యేలు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. కేంద్రమంత్రి ఆయన నివాసంలో లేకపోవడంతో ఆప్‌ నేతలు వెనుదిరిగారు. అనంతరం ఎమ్మెల్యే రాఖీ బిర్లా విూడియాతో మాట్లాడారు. ఢల్లీిలో నెలకొన్న నీటి కొరత సమస్యపై కేంద్ర మంత్రి దృష్టి సారించాలని కోరేందుకు వచ్చామని తెలిపారు.మరో వైపు నీటి సంక్షోభం వల్ల ద్వారకా ప్రాంతంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎంపీ కమల్‌ జిత్‌ ఆప్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ద్వారకా ప్రాంతంలో కనీసం వాటర్‌ ట్యాంకర్లు కూడా అందుబాటులో లేవని ఆరోపించారు. దీంతో ప్రయివేటు ట్యాంకర్ల యజమానులు ప్రజల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. మానవత్వంతో అయినా మంత్రి అతిశీ సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని కోరారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....