DELHI లిక్కర్‌ కేసులో MLC కవితకు ED మరోసారి సమన్లు జారీ

న్యూ ఢల్లీ సెప్టెంబర్‌ 14 (ఇయ్యాల తెలంగాణ ): ఢల్లీ లిక్కర్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్‌ ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. కవితకు సమన్లు జారీ చేయడంతో ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న ఢల్లీి లిక్కర్‌ స్కాం కేసులో మరోసారి కదలిక వచ్చినట్టైంది. శుక్రవారం ఢల్లీిలో హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. గత మార్చిలో మూడు సార్లు ఈడీ ముందు కవిత హాజరయ్యారు. ఆ తరువాత ఈడీ కేసు స్తబ్దుగా మారింది. ఇటీవల అరుణ్‌ రామచంద్రన్‌ పిళ్లై అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే. 164 కింద ఈడీ అధికారులకు పిళ్లై వాంగ్మూలం ఇచ్చారు.పిళ్లై దగ్గర నుంచి ఈడీ అధికారులు కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. కవిత బినావిూగా అరుణ్‌ రామచంద్రన్‌ పిళ్లైపై దర్యాప్తు సంస్థ అభియోగాలు మోపింది. ఇప్పటికే ఈ కేసులో పలువురు సౌత్‌ గ్రూపులోని సభ్యులు అప్రూవర్‌గా మారింది. అప్రూవర్‌గా మారిన అరుణ్‌ రామచంద్రన్‌ పిళ్లై, మాగుంట శ్రీనివాసరెడ్డి , ఆయన కుమారుడు రాఘవరెడ్డి శరత్‌ చంద్రారెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా లిక్కర్‌ కేసులో కొత్త అంశాలు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. రానున్న కొద్ది రోజుల్లో ఢల్లీి లిక్కర్‌ కేసులో మరికొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....